స్కిల్ డెలవప్మెంట్ కేసులో తన రిమాండ్ చట్ట విరుద్దమని .. దాన్ని కొట్టి వేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. చంద్రబాబు పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లుగా జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఏక వాక్యంతో తీర్పు వెలువరించారు. ఈ పిటిషన్పై వాదనలు మూడు రోజుల కిందట ముగిశాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వేతో, సిద్ధార్థ లూధ్రా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించకపోవడంతో క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో అవినీతే లేదని.. తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం లేకపోయినా చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు అంటున్నరు. అరెస్టుకు ముందు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదని.. గవర్నర్ అనుమతితోనే దర్యాప్తు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదన్నారు. అయితే ఆ చట్టం చేయడానికి ముందే నేరం జరిగిందని సీఐడీ లాయర్లు వాదించారు.
గతంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు 17A రక్షణ ఉంటుందని.. ముకుల్ రోహత్గీ వాదించి సుప్రీంకోర్టులో గెలిచారు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా వాదించి మళ్లీ అనుకూల ఫలితం పొందారు. ఓ నోటీసు ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్లో పేరు లేదు. అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు. ఆధారాలు చూపించకుండా జైల్లో పెట్టారు. రాజ్యాంగాన్ని , న్యాయాన్ని నా హక్కులను కాపాడాలి అని ఏసీబీ కోర్టు జడ్జితో చంద్రబాబు అన్నారు. హైకోర్టులోనూ ఆయనకు న్యాయం దక్కలేదు.