టీడీపీలో చేరేందుకు పలువురు వైసీపీ కీలక నేతలు మంత్రాంగం నడుపుతున్నారు. అధినేతతో మాట్లాడి తమ చేరికకు లైన్ క్లియర్ చేయాలని టీడీపీ నేతలను వేడుకుంటున్నారు. అరెస్ట్ ల భయంతో భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేతలు, టీడీపీలో చేరితే ఉపశమనం లభిస్తుందని తమకున్న పరిచయాలతో రాయబారం నడుపుతున్నారు. విశాఖలో వివాదాస్పద భూములను చేజిక్కించుకున్న వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, స్మార్ట్ సిటీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ జీవీలు సైతం టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలిసింది.
ఎంవీవీ సత్యనారాయణ, జీవీల చేరికపై ఓ కీలక నేత చంద్రబాబు వద్ద ప్రస్తావించగా.. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భూకబ్జాలకు పాల్పడి , ప్రజా ధనాన్ని మింగేసిన నేతలను ఎట్టిపరిస్థితుల్లో పార్టీలో జాయిన్ చేసుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజలు ఓ నమ్మకంతో కూటమికి అతి పెద్ద విజయాన్ని కట్టబెట్టారని… అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలను పార్టీలో జాయిన్ చేసుకుంటే ప్రజల నమ్మకాన్ని కోల్పోతామని స్పష్టం చేసినట్లుగా తెలిసింది.
నిజానికి చంద్రబాబు ఒకే అంటే వైసీపీకి చెందిన కీలక నేతలు టీడీపీలో చేరేందుకు కాచుకుచ్చున్నారు. కానీ, అవినీతికి పాల్పడిన నేతలను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని ఎన్నికల సమయంలోనే స్పష్టం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అలాంటి నేతలను పార్టీలో చేర్చుకుంటే కూటమి ప్రతిష్టకు మచ్చ ఏర్పడుతుందని భావిస్తున్నట్టు ఉన్నారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చిన దరిమిలా, అవినీతికి పాల్పడిన నేతలను ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ టైన్ చేయవద్దని చేరికల విషయంలో చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. దీంతో టీడీపీలో చేరాలనుకుంటున్న వైసీపీ నేతల ప్రయత్నాలు ఫలించడం లేదు.