గత ఐదేళ్లలో సహజ వనరులను సైతం వైసీపీ నేతలు దోపిడీ చేశారని అన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం అడవులను కూడా ధ్వంసం చేసిందన్నారు. వైసీపీ హయాంలో జరిగిన నహజ వనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను కూడా వైసీపీ నేతలు దోచేశారని ధ్వజమెత్తారు.
జగన్ హయాంలో కొత్త విధానం ఏర్పాటు చేసి మరీ దోపిడీ చేశారని.. వైజాగ్, ఒంగోలు, చిత్తూర్ లలో భారీ స్థాయిలో భూకబ్జాలకు పాల్పడ్డారన్నారు. ఇళ్ళ నిర్మాణం పేరుతో వైసీపీ నేతలు భూదందాలకు తెరలేపారన్నారు. 23 చోట్ల పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని… పార్టీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ ల్యాండ్ ను అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో భూదోపిడీకి కుట్ర చేశారన్నారని తెలిపారు. అహంభావంతోనే ఈ చట్టం తీసుకొచ్చారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారం ప్రైవేట్ వ్యక్తులను నియమించవద్దన్నారు. ఈ చట్టం దుష్ప్రభావాలు ప్రజలు గుర్తించి వైసీపీకి బుద్ది చెప్పారన్నారు.
రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు కూడా ప్రయత్నించారు. వృద్దాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ ల్యాండ్స్ ను కూడా కొట్టేశారన్నారు. దస్పల్లా భూములను కొట్టేసి ఇల్లు కట్టారు. మాజీ ఎంపీ ఎంవీవీ అనేక భూఅక్రమాలకు పాల్పడ్డారు. ఒంగోలులో నకిలీపత్రాలతో 101కోట్ల ఆస్తి కొట్టేసేందుకు ప్రయత్నించారని..భూకబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. తిరుపతి జిల్లాలో భూఅక్రమాలకు లెక్కే లేదన్నారు. 22-ఏ పెట్టి భూఅక్రమాలు చేశారు. చిత్తూర్ లో 782ఎకరాలు కాజేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. పుంగనూరులో 982ఎకరాలను పట్టా చేయించుకున్నారు. పేదవారి అసైన్డ్ భూములను కూడా వదల్లేదని నిప్పులు చెరిగారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉండే భూములను ఆక్రమించారని చంద్రబాబు మండిపడ్డారు. అక్రమంగా భూములను కాజేయడమే కాదు.. ఈ వ్యవహారంపై ప్రశ్నించిన వారిపై దాడులు కూడా చేశారన్నారు. దాదాపు 14 వేల ఎకరాలను వైసీపీ నేతలకు అప్పగించారని సంచలన విషయాలను వెల్లడించారు. తక్కువ ధరకే నలభై వేల ఎకరాలు కొన్నారని, అధికారులను బెదిరించి పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు. భూహక్కు పత్రంతో 13వేల కోట్లు ప్రచారానికి కేటాయించారని తెలిపారు. భూమూల రీసర్వే పేరుతో జగన్ ఫోటో పెట్టుకున్నారని వివరించారు చంద్రబాబు.
సహజ వనరుల దోపిడీపై చంద్రబాబు పూర్తి ప్రసంగం కింది లింక్ లో