అమరావతిపై ఓ సామాజికవర్గ ముద్రను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి వేస్తోందని తెలిసినా.. తిప్పికొట్టేందుకు అప్పటి ప్రభుత్వం కానీ.. అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీ కానీ ప్రత్యేకమైన ప్రచార ప్రణాళికలేమీ వేసుకోలేదు. ఫలితంగా దెబ్బతిన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీ.. రాజధాని మార్పు కోసం.. అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని తిప్పికొట్టకపోతే ఏం జరుగుతుందో టీడీపీకి తెలిసి వచ్చినట్లుగా ఉంది. కొద్ది రోజులుగా.. అధికారపార్టీపై.. సామాజిక కోణంలోనే ఎదురుదాడి చేస్తున్నారు. చంద్రబాబు కూడా.. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించారు.
చంద్రబాబు వేసిన ప్రశ్న.. ఇప్పటి వరకూ.. రాజధాని ఒకే సామాజికవర్గానిదంటూ… జరిగిన ప్రచారాన్ని నమ్మిన వారిని ఆలోచింపచేసేలా చేసింది. అమరావతి ఒక్క సామాజికవర్గానిదే ఎలా అవుతుందనే చర్చలు.. ప్రారంభించేలా చేసింది. అదే సమయంలో.. టీడీపీ అధినేత.. మరింత దూకుడుగా వైసీపీకి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. రాజధానిపై కులం ముద్ర వేయడం.. వైశాచికత్వానికి నిదర్శనమని మండిపడటమే కాదు… హైదరాబాద్‌ను ఉదాహరణగా చెబుతున్నారు. తాము హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని.. ఇప్పుడు అక్కడ కొన్ని లక్షల మంది లబ్ది పొందుతున్నారని.. వారంతా.. ఒకే సామాజికవర్గం వారా అని ప్రశ్నిస్తున్నారు. ఒక్క సామాజికవర్గం కోసమే అభివృద్ధి చేశామా… అని సూటిగానే అడుగుతున్నారు. ఓ నగరం అభివృద్ది చెందితే కుల, మత, ప్రాంతాలకు అతీతంగా… ప్రజలందరూ లబ్దిపొందుతారని గుర్తు చేస్తున్నారు.
అమరావతిపై సామాజిక ముద్ర వేసి తరలిస్తే… జగన్ టార్గెట్ పెట్టుకున్న సామాజికవర్గం నష్టపోతుంది… అలాగే.. వారి కన్నా… మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు నష్టపోతాయి. కానీ.. వారు నష్టపోయినా పర్వాలేదు… తాము టార్గెట్ పెట్టుకున్న సామాజికవర్గం మాత్రం నాశనమైపోవాలన్నట్లుగా అధికార పార్టీ తీరు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ విషయాన్ని సూటిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల్లో పడిపోయిన ముద్రను.. ఇప్పుడు.. చెరపగలరా.. అన్నదే.. అసలైన పాయింట్.. అందుకే.. ఈ విషయంలో చంద్రబాబు ఆలస్యంగా మేలుకున్నారని అంటున్నారు.