అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదంపై సర్కార్ సీరియస్ అయ్యింది. కొత్త సబ్ కలెక్టర్ వచ్చే ముందు అగ్ని ప్రమాదం జరగటంపై అనుమానాలు వ్యక్తం కావటంతో సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశించారు.
కీలకమైన ఫైల్స్ దగ్ధం కావటం పై సర్కార్ అనుమానంగా ఉంది. భూములకు సంబంధించిన వ్యవహరాలపై కీలకమైన ఫైల్స్ దగ్ధం అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇందులో కుట్ర కోణం ఉందా ప్రమాదవశాత్తుగానే జరిగిందా అన్న అంశంపై విచారణ జరగనుంది.
మదనపల్లె సబ్ కలెక్టరేట్ పరిధిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయన్న ఆరోపణలున్నాయి. అక్కడ వైసీపీ నేతలకు అనుకూలంగా గతంలో పలు నిర్ణయాలు జరిగాయన్న విమర్శలొచ్చాయి. కొత్త ప్రభుత్వం అక్కడున్న అధికారులను బదిలీ చేసిన నేపథ్యంలో… అగ్ని ప్రమాదం జరగటంపై కూటమి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో హెలికాప్టర్ లో డీజీపీ, సీఐడీ చీఫ్ లు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసుకు వెళ్లనున్నారు.