జగన్ సినిమా అయిపోయిందని.. అట్టర్ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ఉండదని చంద్రబాబు తేల్చేశారు. తాడేపల్లిగూడెం సిద్ధం సభలో చంద్రబాబు ప్రసంగం అత్యంత ఉత్సాహంగా సాగింది.- జగన్ పాలన ఒక అట్టర్‌ఫ్లాప్ సినిమా. అలాంటి సినిమాకి సీక్వెల్ ఉంటుందా? టీడీపీ -జనసేన కూటమి సూపర్‌హిట్. వైకాపా గూండాలకు మా సినిమా చూపిస్తాం. తెదేపా-జనసేన విన్నింగ్ టీమ్ అని ధీమా వ్యక్తం చేశారు. అవసరమైతే ఏ త్యాగాలకైనా మేం సిద్ధమని.. తన పాలన కోసం రాష్ట్రాన్ని, కులాలు, మతాలు, ప్రాంతాలుగా విభజిస్తున్నారని ఆరోపించారు. ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనేదే మా సంకల్పం.. అవసరమైతే ఏ త్యాగాలకైనా మేం సిద్ధమన్నారు.
తెలుగు జాతిని ప్రపంచంలోనే నెం.1 స్థానంలో నిలబెట్టడమే మా లక్ష్యమన్నారు. జగన్ ఒక బ్లఫ్ మాస్టర్.. అంటే పదేపదే అబద్ధాలు చెప్పడం.. చేయని పనులు చేసినట్లు చెప్పుకునే వ్యక్తి జగన్‌రెడ్డి అని విమర్శించారు. హూ కిల్డ్ బాబాయ్.. జగన్‌రెడ్డి జవాబు చెప్పాలన్నారు. జగన్ తన పాలనలో అందరినీ బాధపెట్టాడు, అవమానించాడు .. సినిమా టికెట్ల పేరుతో చిరంజీవి, రాజమౌళిని అవమానించారు ..వై నాట్ 175 అని జగన్ అంటున్నాడన్నారు. వైసీపీ దొంగలపై మనం పోరాడుతున్నామని తెలిపారు. కొండనైనా బద్ధలు చేస్తామనే ధైర్యం టీడీపీ-జనసేన కూటమి ఇస్తుందన్నారు.
రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు తమదని.. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం. పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే సంకల్పంతో ముందుకెళ్లాం. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు సైకో పాలన ఉంది. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారు.. జగన్ సీఎం అయ్యాక అరాచకాలతో పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారు. వైకాపా వేధింపులు తట్టుకోలేక క్రికెటర్ హనుమ విహారి పారిపోయే పరిస్థితి వచ్చింది. సొంత చెల్లి మరో పార్టీలో చేరితే సోషల్‌మీడియాలో వేధించారు. జగన్ మానసిక స్థితికి ఈ ఘటనలే నిదర్శనం. అందుకే, వైకాపాను చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు.