వరదలో చిక్కుకున్న ప్రజల కన్నీళ్లు కర్తవ్యాన్ని నిర్దేశించాయి.. ఏ క్షణం ఏ ఉప్పెన వచ్చి మీద పడుతుందో తెలియని సమయనా..తన సంకల్పానికి ప్రకృతి సైతం సెల్యూట్ కొట్టింది. బోటులో ప్రయాణంతో భద్రతపరమైన సమస్యలు వస్తాయని అధికారులు హెచ్చరించినా ..అర్దరాత్రి అయినా, అపరాత్రి అయినా ప్రజలను కలవాల్సిందే పట్టుదలకు విజయవాడ ప్రజానీకం పరవశించింది. గుండె పగిలిన ఆవేదనతో తల్లడిల్లుతున్న జనానికి నేనున్నా అన్న భరోసా కొండంత ఆత్మస్తైర్యాన్ని ఇచ్చింది.
చంద్రబాబు..74 ఏళ్ల వయస్సు..ఆదివారం ఉదయం నుంచి అధికారులు, మంత్రులు, డీజీపీలతో వరుస సమీక్షలు..ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు బిజీ..బిజీ..ఉదయం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు చూసిన దృశ్యాలు..ఉన్నపళంగా ఇలా జరిగిదేంటి అని భావోద్వేగంతో కళ్ళు చెమర్చిన బాధితుల విషాదవదనాలు..సీఎం చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసినట్టు ఉన్నాయి. అందుకే అర్దరాత్రి అయినా ప్రజలెలా ఉన్నారో.. వారికి అధికారులు ఎలాంటి సహాయ, సహకారాలు అందిస్తున్నారో తెలుసుకోవాలని జలదిగ్బంధంలో చిక్కున్న ప్రాంతాల్లో బోటులో పర్యటించారు.
అర్దరాత్రి అధికారులు రావడమే గగనం.. అలాంటిది సీఎం రావడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. నేరుగా వరద బాధితుల వద్దకు వెళ్లి అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు..ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనతో ఉన్న విజయవాడ వాసులకు నేనున్నానని.. పూర్తిగా అండగా ఉంటానని ఓ చిన్న వాక్యం ఆత్మస్తైర్యాన్ని ఇచ్చింది..అందులో చంద్రబాబు నిశిరాత్రిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బోటుపై పర్యటించడంతో బాధితులకూ సర్కార్ ఆదుకుంటుంది అన్న భరోసా కల్గింది.
14 గంటల పాటు కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించి సోమవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో విజయవాడ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బస్సులో చంద్రబాబు విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లడం గమనార్హం. అయినా మళ్లీ ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో తన పర్యటన కొనసాగిస్తున్నారు. పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు.