పార్టీ కోసం అంత చేశాం.. ఇంత చేశాం అని సెంటిమెంట్ పండించి.. పబ్బం గడుపుకోవాలనుకునే నేతలకు చంద్రబాబు చెక్ పెడుతున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నామని పార్టీ గెలుపు కోసం పని చేస్తే చేయండ లేకపోతే వేరే దారి చూస్కోండని సంకేతాలు పంపుతున్నారు. చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు ఈ సారి టిక్కెట్ లేదనే సంకేతాలు కొన్నాళ్లుగా కనిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ వచ్చిందేమో కానీ ఆయన అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. భాష్యం ప్రవీణ్‌కు చిలుకలూరిపేట టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆయనెరని..ఆయనకు చిలుకలూరిపేటలో ఓటులేదని మీడియాతో చెప్పుకొచ్చారు. కానీ హైకమాండ్ వద్ద ఏం జరుగుతుందో పుల్లారావుకు తెలుసంటున్నారు.
కోడెల తనయుడు శివరాం చేసిన తప్పుల వల్లే ఆయన తండ్రి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందనేది బహిరంగ రహస్యం. అయితే తన తండ్రి లెగసీని కాపాడుతానని ఆయన ఇటీవల రాజకీయం చేస్తున్నారు. కన్నాను సత్తెనపల్లి ఇంచార్జ్ గా నియమించిన తర్వాత ఆయన పార్టీకి నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబు ఇక ఆయనను పట్టించుకోకూడదని డిసైడయినట్లుగా చెబుతున్నారు. పార్టీలో చాలా మంది సీనియర్లకు ఇప్పటికే సంకేతాలు పంపారని అంటున్నారు. చాలా మంది నేతలు… నాలుగేళ్ల పాటుకలుగులో దాక్కుని ఇప్పుడే బయటకు వస్తున్నారు.
పార్టీకి పాజిటివ్ వాతావరణం ఏర్పడిన తర్వాత .. ఇంత కాలం కేసుల జోలికి పోకుండా.. హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకున్న వారు ఇప్పుడు… తమకు మాత్రమే సాధ్యమయ్యే ప్రకటనలతో బయటకు వస్తున్నారు. అయితే వారందరికీ చంద్రబాబు చెక్ పెడుతున్నారు. ఈ సారి అనవసర లగేజీతో తాను ఎన్నికలకు వెళ్లబోనని… మొహమాటాలకు చాన్సే లేదని చెబుతున్నారు.