టీడీపీ అధినేత చంద్రబాబు.. జాతీయ రాజకీయాలపై.. పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఎన్నికల తర్వాత బీజేపీ వైపు వెళ్తారని ప్రచారం ఊపందుకుంటున్న… బీఎస్పీ అధినేత్రి మాయావతి విషయంలో… కాంగ్రెసేతర పార్టీలన్నీ ఆందోళనతో ఉన్నాయి. అందుకే… టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. ఈసీ వద్ద నిరసన వ్యక్తం చేయడానికని చెప్పి ఢిల్లీ వెళ్తున్న ఆయన… అసలు పని మాత్రం.. విపక్ష పార్టీలన్నింటినీ మధ్య మరింత నమ్మకం పెంచడం. పక్క చూపులు చూస్తారని భావిస్తున్న వారి మనసులోకి అలాంటివి రానివ్వకుండా చేయడం.
ప్రధాని రేసులో ఉన్నానని.. బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. అయితే.. ఆమెకు ప్రధాని ఇవ్వకపోతే.. కాంగ్రెసేతర కూటమి ఉండే అవకాశం లేదన్న ప్రచారం ఊపందుకుంది. బీజేపీతో పాటు.. కాంగ్రెస్ పార్టీపైనా ఆమె విరుచుకుపడుతున్నారు. ఆమె గతంలో చేసిన రాజకీయాలు… ఇతర వ్యవహారాలను బట్టి చూస్తే… తనకు రాజకీయ అవసరం అయితే.. బీజేపీతో జట్టు కట్టేందుకు సిద్ధమన్న ప్రచారం .. చాలా కాలంగా జరుగుతోంది. కానీ ఈ విషయంలో మాయావతి ఎప్పుడూ బయటపడలేదు. ఏడో విడత పోలింగ్ ముగుస్తున్న సమయంలో… ఆమెను.. కాంగ్రెసేతర కూటమిలోనే ఉంచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఆయన లక్నో వెళ్లి మాయావతితో సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. విపక్షాల భేటీకి ఆహ్వానించే అవకాశం ఉంది.
మాయావతిని… 23వ తేదీన సమావేశానికి వచ్చేలా ఒప్పించగలిగితే… అదే చాలా పెద్ద విజయం అవుతుంది. అఖిలేష్ యాదవ్… బీఎస్పీతో.. పొత్తు కోసం చేసుకున్న ఒప్పందంలో భాగంగా.. మాయావతికి ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతివ్వాల్సి ఉంది. ఈక్రమంలో.. మాయావతి.. విపక్షాల భేటీకి వచ్చేందుకు అంగీకరిస్తే… అఖిలేష్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక మమతా బెనర్జీ .. ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పకపోయినా.. ఆమె… బీజేపీతో చేస్తున్న ఫైట్ ను చూస్తే.. కచ్చితంగా హాజరువుతారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు.. 23వ తేదీ భేటీ కోసం.. అన్ని బీజేపీయేతర పార్టీలను.. రప్పించే బాధ్యతను తీసుకున్నారు.