తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. లాయర్ సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరు కానున్నారు. చంద్రబాబు పై ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పై పిటిషన్ 23వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేయాలనుకుంది. కానీ వ్యక్తిగత కార్యక్రమాలు ఉన్నాయని 30వ తేదీకి వాయిదా వేయాలని సిద్దార్థ లూధ్రా సుప్రీంకోర్టును కోరారు. ఆ వ్యక్తిగత కార్యక్రమం తన కుమారుడి వివాహం అని తెలుస్తోంది.
సిద్ధార్థ లూధ్రా చంద్రబాబుకు చాలా కాలంగా సన్నిహితులు. టీడీపీకి సుప్రీంకోర్టు స్థాయిలో ఏమైనా న్యాయ సాయం కావాలంటే ఆయనే ఎక్కువగా చేస్తారు. చంద్రబాబుపై ఏపీ సర్కార్ పెడుతున్న కేసుల్లో వాదించేందుకు ఆయన విజయవాడ కూడా పలుమార్లు వచ్చారు. క్వాష్ పిటిషన్ పై వాదనలకు మరో సీనియర్ లాయర్ హరీష్ సాల్వేతో కలిసి వాదించారు. ఆ కేసుపై తీర్పు రావాల్సి ఉంది. నెల రోజులుగా తీర్పు రిజర్వ్ లో ఉంది.
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీ వర్గాల్లోనూ టెన్షన్ ప్రారంభమయింది. చంద్రబాబు ఢిల్లీలో ఎవరిని కలుస్తారని ఆరా తీయడం ప్రారంభించారు. ప్రత్యేకంగా నిఘా పెట్టడానికి కొంతమందిని ముందుగానే ఢిల్లీ పంపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.