చంద్రబాబు తన చేతికి చక్రం వచ్చిందని అసలు ఫీల్ కావడం లేదు. వచ్చినా ఆ చక్రం బీజేపీకే ఇచ్చేసినట్లుగా వ్యవహరిస్తున్నారు. స్పీకర్ పదవి కోసం టీడీపీ పట్టుబడుతుందని నేషనల్ మీడియా చెబుతూ వస్తోంది. వారిచ్చే హైప్ ని చంద్రబాబు అసలు పరిగణనలోకి తీసుకోలేదు. అసలు అలాంటి ఆలోచన కూడా లేదని పార్టీ ఎంపీలకు చంద్రబాబు చెప్పారు. రాజకీయ పదవులకోసం వెంపర్లాడటం లేదని ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు.
అయితే చంద్రబాబు రాజకీయ పదవుల కన్నా రాష్ట్రంకోసం ఎక్కువ లాబీయింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎంపీల్ని బృందాలుగా విడదీసి.. కేంద్ర ప్రభుత్వ శాఖల్ని అప్పగించి రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి రెగ్యులర్ గా ఫాలో అప్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక తన స్థాయిలో తాను చేయాల్సిన వాటి గురించి.. రాబట్టాల్సిన వాటి గురించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమయింది. వచ్చే ప్రయోజనాలకు పబ్లిసిటీ చేసుకుంటే ఇతర రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తాయి కాబట్టి వీలైనంత వరకు సైలెంట్ గా రాష్ట్రానికి కావాల్సిన వాటిని చక్కబెట్టే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వంాన్ని నడపడం… ఆర్థిక సవాళ్ల మధ్య అంత తేలికేం కాదు. సూపర్ సిక్స్‌ను అమలు చేయడం ముఖ్యం. అలాగే.. జగన్ రెడ్డి హయాంలో చేసిన అలవిమాలిన అప్పులపైనా ఓ దృష్టిపెట్టాల్సి ఉంది. కేంద్రం సహకారం ఇందుకు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే… చంద్రబాబు … రాజకీయ పదవులపై పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు.. తన పార్టీ నేతల్నీ దానికి తగ్గట్లుగా సర్దుబాటు చేస్తున్నారు.