చంద్రబాబు వేసిన విత్తనాలే నేడు వట వట వృక్షాలుగా మారాయని కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. తాను అలాంటి ప్రయత్నమే చేశానని చెప్పుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాడు చేసిన పనుల గురించి వివరించారు. బీఆర్ఎస్ రాజకీయ విధానం ప్రకారం చంద్రబాబు హైదరాబాద్‌కు ఏమీ చేయలేదు. దానంతటకు అదే ఎదిగింది అని చెప్పుకోవాలి. కానీ కేటీఆర్ తాను అలాంటి ప్రయత్నాలే చేశానని ..కానీ కేసులు పెడుతున్నారని చెప్పుకునేందుకు చంద్రబాబు వేసిన బీజాల గురించి చెప్పాల్సిన వచ్చింది.
కేటీఆర్ జీనోమ్ వ్యాలీ గురించి చెప్పారు. కానీ హైదరాబాద్‌లోకి విజయవాడ వైపు నుంచి ఎంట్రీ ఇచ్చే దగ్గర నుంచి సంగారెడ్డి వైపు బయటకు వెళ్లే వరకూ ప్రతీ చోటా చంద్రబాబు వేసిన విత్తనాలు వట వృక్షాలుగా కనిపిస్తాయి. క్రీడారరంగంలో సరూర్ నగర్ స్టేడియం.. గచ్చిబౌలి స్టేడియాలు నిర్మించారు. హైటెక్ సిటీని నిర్మించడంతోనే పని కాలేదు..సాఫ్ట్ వేర్ రంగాన్ని తీసుకు వచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అడుగు అడుగులో కనిపిపిస్తాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు , బటర్ రింగ్ రోడ్ చంద్రబాబు ప్లాన్ చేసి.. భూసేకరణ చేసిన దశలో ఓడిపోయారు. కానీ ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలే .. వట వృక్షాలుగా మారి ఆ నీడలోనే హైదరాబాద్ సేద దీరుతోంది. ప్రపంచనగరంగా ఎదుగుతోంది.
రాజకీయాల కోసం ఆయనపై నిందలు వేయవచ్చు. ఆయన శారరీక లోపాల్ని చూపించి దూషించవచ్చు. కానీ హైదరాబాద్ విషయంలో కానీ.. ఉమ్మడిరాష్ట్ర విషయంలో కానీ ఆయన పాలనా సమయంలో తీసుకున్న నిర్ణయాలు..వేసినబీజాల కారణగా కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి. పడుతున్నాయి. కానీ రాజకీయాల్లో ఉండే అతి పెద్ద దుర్లక్షణం ఏమిటంటే కనీస కృతజ్ఞత లేకపోవడం. అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకోవడం.