ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ అడిగితే సీఎంవో నుంచి వెంటనే రిప్లయ్ వస్తోంది. వెళ్లి కలుస్తున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు అన్ని రోజుల పాటు ఎమ్మెల్యేకు అందుబాటులో ఉన్నారు. అపాయింట్ మెంట్ లేకుండానే నేరుగా వెళ్లి కలిసి తమ నియోజకవర్గాలకు కావాల్సిన పనులు, పరిష్కరించాల్సిన సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. కొన్ని పనులకు భరోసా తెచ్చుకున్నారు. మరికొన్ని పనులకు ఆదేశాలు తెచ్చుకున్నారు.
గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలోనూ జగన్ ను కలవాలంటే ఎమ్మెల్యేలకు ఓ కోటరీ దాటుకుని ముందుకు పోవాల్సిన ఉంటుంది. అది అసాధ్యంగా కనిపించేది. ఏ విషయం అయినా నేరుగా జగన్ దగ్గరకు తీసుకెళ్లడం అసాధ్యంగా మారేది. అలా ఆయన ఐదేళ్ల కాలంలో తనకు ఉన్న 150 మంది ఎమ్మెల్యేలను కనీసం రెండు, మూడు సార్లు కూడా కలిసి ఉండరు. వారి వారి నియోజకవర్గాల్లో బహిరంగసభలు పెడితే స్టేజి మీదకు రానిస్తారు..చేతులు ఊపనిస్తారు కానీ.. మాట్లాడేదేమీ ఉండదు.
టీడీపీతో పాటు కూటమి ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఆ సమస్య లేదు. చంద్రబాబును కలిసేందుకు.. పనులు చేయించుకునేందుకు ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి అంటే కోటలోని రాజు కాదని అందరికీ అందుబాటులో ఉండే పాలకుడు అన చంద్రబాబు మరోసారి నిరూపిస్తున్నారని ఎమ్మెల్యేలు సంతోషపడుతున్నారు.