లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చంద్రబాబు పాత్ర జాతీయ స్థాయిలో కీలకం కానుందా..? బీజేపీ హ్యాట్రిక్ ఆశలు నెరవేరాలంటే చంద్రబాబు మద్దతు అనివార్యమా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
జూన్ 4 అనంతరం చంద్రబాబు పాత్ర జాతీయ స్థాయిలో కీలకం కానున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో చార్ సౌ పార్ అనే నినాదంతో బీజేపీ ఎన్నికల కదనరంగంలోకి దూకినా ఆమేరకు సీట్లను సాధించలేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి బీజేపీ 250 సీట్లలోపే పరిమితం అయ్యేలా ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల మద్దతు ఖచ్చితంగా అవసరం ఏర్పడుతుందనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.
ఎలాగూ ఏపీ నుంచి కూటమికి 17 -20 ఎంపీ సీట్లు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సీట్ల సంఖ్య అటు, ఇటుగా వస్తే టీడీపీ సపోర్ట్ బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెడుతుందని కమలనాథులు కూడా విశ్వాసంతో ఉన్నారు. అందుకే కేంద్రంలో చంద్రబాబు పాత్ర కీలకం కానుందని జోరుగా చర్చ జరుగుతోంది. కేంద్ర కేబినెట్ లో టీడీపీకి ప్రాధాన్యత కూడా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదే జరిగితే ఏపీలో అభివృద్ధి జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతుందని కూటమి నేతలు కూడా ఖుషి, ఖుషీగా ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..