స్కీల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జనవరి 19వ తేదీకి వాయిదా పడింది. అంటే..దాదాపు నెలన్నర తర్వాతకు వాయిదా పడింది. కారణం ఏమిటంటే.. క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వులో ఉండటమే. అలాగే మరో మూడు రోజుల తర్వాత పైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుంది. అప్పుడు కూడా వాయిదా పడటం ఖాయమే. ఏసీబీ కోర్టులో పిటీ వారెంట్లు.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు .. ఇలా చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో అనేకానేక విచారణలు క్వాష్ పిటిషన్ పై తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి.
చంద్రబాబు కూడా.. క్వాష్ చేస్తే తన రాజకీయం తాను చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ పర్యటనల వల్ల ఆయనకు ఇబ్బంది లేకపోయినప్పటికీ.. బెయిల్ పై ఉన్నానన్న అసంతృప్తి ఆయనలో ఉంది. తనపై ఏదో బంధనాలు ఉన్నాయని ఆయన ఫీలవుతున్నారు. అందుకే పూర్తి స్థాయి రాజకీయాన్ని ఇంకా ప్రారంభించలేదు. అక్టోబర్ లోనే క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయింది. ఇంత కాలం ఓ కేసు తీర్పును .. అదీ కూడా క్వాష్ పిటిషన్ పై తీర్పును పెండింగ్ లో పెట్టడం న్యాయవ్రగాలను సైతం విస్మయ పరుస్తోంది. మరో వైపు రాజకీయ ప్రాధాన్యమున్న కేసులన్నీ.. జస్టిస్ బేలా త్రివేది ఉన్న బెంచ్ మీదకే వెళ్తున్నాయని.. దీని వెనుక ఏం ఉందన్న గుసగుసలు సుప్రీంకోర్టులో వస్తున్నాయి.
మొత్తంగా ఎనిమిది రాజకీయ పరంగా సున్నితమైన కేసులు జస్టిస్ బేలా త్రివేదీ ముందు ఉన్నాయని.. రోస్టర్ అక్రమాలు జరుగుతున్నాయని కొంత మంది సుప్రీంకోర్టు లాయర్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ కలిపి ఢిల్లీ నుంచి గల్లీ వరకు రచ్చనీయాంశం అవుతున్నాయి.