ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిళ్లు ఓ పెద్ద జాడ్యం. గత ఐదేళ్ల కాలంలో ఎన్ని అరాచకాలు జరిగాయో చెప్పాల్సిన పని లేదు. తెనాలిలో ప్రత్యేకంగా మత మార్పిళ్ల కోసం ఓ ఘాట్ కూడా నిర్మించే ప్రయత్నం జరిగిందంటే.. ఎంత దూరం వెళ్లిందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో.. బలవంతపు మత మార్పిళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దేవాదాయశాఖపై జరిగిన సమీక్షలో చంద్రబాబు ఈ అంశంపై స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో బలవంతపు మత మార్పిళ్లు ఎక్కువగా ఉన్నాయి. భయపెట్టి.. ఆశ పెట్టి గిరిజనుల్ని మతం మారేలా చేయడంలో కొన్ని సంస్థలు ప్రత్యేకంగా పని చేస్తున్నాయి. ఓ ఐపీఎస్ అధికారి నేతృత్వంలోని కంపెనీ కూడా అదే పనిలో ఉంది. ఈ ఐపీఎస్ అధికారి మత మార్పిళ్ల వ్యవహారం ఆయన స్పీచ్లపై కేంద్రానికి చాలా సార్లు ఫిర్యాదులు వెళ్లాయి. చర్యలు తీసుకోవాలని పలుమార్లు కేంద్రం రాష్ట్రానికి లేఖలు రాసింది కూడా. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇప్పుడు ఇలాంటి వాటన్నింటినీ బయటకు తీసి.. మత మార్పిళ్ల నిరోధానికి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దేశంలో అత్యధిక చర్చిలు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. నిజానికి అవన్నీ అనధికారికం. రికార్డుల్లో అసలైన క్రిస్టియన్లు చాలా తక్కువగా ఉంటారు. కానీ రాజకీయ స్వార్థం కోసం చేసిన బలమైన కుట్రలో భాగంగా మతం మారిపోయిన వాళ్లు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం రెడీ అయింది.