ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకే ఏడాది రాజకీయ రంగ ప్రవేశం చేసిన.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు… మొదట్లో మంచి మిత్రులు. కాంగ్రెస్ పార్టీ నుంచే వారు రాజకీయం ప్రారంభించారు. తర్వాత ఎవరి దారి వారిదయింది. అయినప్పటికీ.. వారు ముందుగా మిత్రులు. రాజకీయంలో మిత్రత్వం బయటకు కనిపిస్తే.. ఆ ప్రభావం పార్టీలపై ఉంటుంది కాబట్టి.. ఇతర పార్టీల తరపున తాము లీడ్ చేస్తున్నప్పుడు.. అలాంటిది బయట పెట్టుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఇద్దరికీ ఒకరంటే.. ఒకరికి అభిమానం ఉండేదని… ఆనాటి మీడియా మిత్రులకూ తెలుసు. దురదృష్టవశాత్తూ.. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. దాంతో.. వారిద్దరి మధ్య రాజకీయం, అనుబంధం కూడా ముగిసిపోయింది. ఇప్పుడు.. ఆయన కుమారుడు జగన్.. వైఎస్ బ్రాండ్ తో.. కాంగ్రెస్‌ను వదిలేసి.. సొంత పార్టీ పెట్టుకున్నారు. రాజకీయం చేస్తున్నారు. అప్పుడు వైఎస్‌తో పోరాడారు.. ఇప్పుడు.. జగన్‌తో పోరాడుతున్నారు. ఎవరు ఏమిటి..? ఎవరి వ్యక్తిత్వం ఏమిటి..? ఇలాంటి వాటిపై.. చంద్రబాబు ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేశారు.
జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. వెయ్యి వంతుల మేలని విశ్లేషించారు. దానికి పలు అంశాలను వివరించారు. వైఎస్, తాను ఎంత ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. హుందా రాజకీయాలనే నడిపారమని గుర్తు చేశారు. వైఎస్ ఒక్క సారి మాత్రమే తనను.. దుషించారని.. అదీ కూడా అసెంబ్లీలో అన్నారు. ఆ తర్వాత ఆ విషయంపైనా క్షమాపణ చెప్పారని.. కానీ.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు.. అత్యంత దారుణంగా ఉంటాయన్నారు. తుపాకీతో కాల్చాలనడం, చెప్పుతో కొట్టాలనడం, బంగాళాఖాతంలో పడేయాలనం.. వంటి మాటలు మాట్లాడటమే కాదు.. తప్పు మాట్లాడినట్లుగా భావించకపోవడం… వ్యక్తిత్వ పరంగా మరుగుజ్జుతనంగా.. చంద్రబాబు విశ్లేషించారు.
జగన్మోహన్ రెడ్డి తీరుపై మొదటి నుంచి ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఆయన పెద్దల్ని ఏ మాత్రం గౌరవించరు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. తీరు మార్చుకోరు. అదే విషయాన్ని చంద్రబాబు… సునిశితంగా వివరించారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి “కండక్ట్” సర్టిఫికెట్.. అటు ప్రత్యర్థి పార్టీల్లోనే కాదు.. ఇటు సొంత పార్టీలోనూ అంత గొప్పగా లేదు. రాజకీయాలలో ప్రత్యర్థులంటే.. వ్యక్తిగత శత్రువులుగా భావించే పరిస్థితికి.. జగన్ చేరారన్న విషయం.. చంద్రబాబు… చెప్పకనే చెప్పారు.