ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడుల కేసులనూ రీఓపెన్ చేస్తున్నారు పోలీసులు. తాజాగా కృష్ణా జిల్లా నందిగమలో జరిగిన రాళ్ల దాడి కేసును రీఓపెన్ చేసి ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ వైసీపీ నేతలు. చంద్రబాబు నందిగామకు వెళ్లినప్పుడు వాహనం పై నుంచి నిలబడి ప్రసగిస్తున్న సమయంలో ప్లాన్ ప్రకారం రాళ్లు విసిరారు. ఈ రాళ్లు చంద్రబాబు పక్కనే ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. విచారణ చేయాల్సిన కాంతిరాణా టాటా పూలతో కలిసి రాళ్లు పడ్డాయని కవర్ చేశారు. కేసును చాలా తేలిక సెక్షన్లతో నమోదు చేశారు.
అవే రాళ్లు చంద్రబాబుకు తగిలి ఉంటే ప్రాణపాయం జరిగేదని తెలిసి అప్పటి సీపీ కుట్రపూరితంగా వ్యవహరించారు. చంద్రబాబుపై రాళ్ల దాడులుచాలా ఫ్రీక్వెంట్ గా జరిగాయి. 70 ఏళ్లు దాటిన చంద్రబాబుపై ఇలా రాళ్ల దాడులు చేస్తే ఆయనకు తలకు ఎక్కడ తగిలినా తట్టుకోవడం కష్టమన్న ఉద్దేశంతో కుట్ర పూరితంగా పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్క అయి దాడులు చేశారని ఇవి ఖచ్చితంగా హత్యా ప్రయత్నాలేనన్న అనుమానాలు ఉన్నాయి.
మార్కాపురంలో ఇలా చంద్రబాబుపై రాళ్ల దాడిని అప్పటి మంత్రి చొక్కా విప్పి మరీ చేయించారు. ఆ సమయంలో ఓ వృద్ధుడురాళ్ల దాడులకు గురై చనిపోయాడు. ఇలాంటి కుట్రలకు పోలీసులు కూడా కావాలని మద్దతు పలకడం సంచనలంగా మారింది. వీటిని బయట పెట్టాలని ప్రస్తుతం పోలీసులు కూడా నిర్ణయించారు.