ఏపీ పోలీసులు ప్రజల్లోకి వెళ్తున్న అధికార పార్టీ నేతల్ని అడ్డుకోవడానికే పూర్తి బలం.. బలగం కేటాయిస్తున్నారు. అటు లోకేష్ పాదయాత్రకు వెళ్తూంటే.. వజ్ర లాంటి వాహనాలతో వందల మంది పోలీసులు గుమికూడి కనిపిస్తున్నారు. తూ.గో జిల్లాలో చంద్రబాబు పర్యటనలో మూడో రోజూ అదే పని చేశారు. ఇక్కడ ఇంకా ఓవరాక్షన్ చేశారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చి మళ్లీ ఎవరో చెప్పినట్లుగా రాత్రికి రాత్రి అనుమతి రద్దు చేశారు. అంతే కాదు చంద్రబాబు ఆనపర్తికి వెళ్లకుండా.. పోలీసులు వాహనాలకు అడ్డంగా కూర్చోవడం.. రోడ్లకు వాహనాలు అడ్డం పెట్టజడం లాంటి పనులు కూడా చేశారు.
ఆనపర్తికి చంద్రబాబు వెళ్తే ఏమవుతుందో కానీ..పోలీసులు ఇలా ఓ ప్రతిపక్ష నేతను తన ప్రజాస్వామ్య హక్కు ప్రకారం.. పర్యిటంచకుండా పోలీసులు అడ్డుకోవడం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఆనపర్తికి వెళ్లే దారిలోనే వాహనాలను అడ్డుకోవడంతో చంద్రబాబు వాహనం దిగి ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆనపర్తికి నడుచుకుంటూ వెళ్లారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తీవ్రంగా చ్చనీయాంశం అవుతోంది. ఏ చట్టాల ప్రకారం అడ్డుకుంటున్నారో కానీ.. మొత్తానికి ప్రతిపక్ష నేతలు మాత్రం ప్రజల్లోకి వెళ్లకూడదని.. వెళ్లాంటే.. తాము చెప్పినట్లుగా వెళ్లాలన్నట్లుగా పోలీసుల తీరు ఉంది.
నిజానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. మొదటి రెండు రోజుల పర్యటన తర్వాత … ఇంకా చంద్రబాబు టూర్ జరిగితే… జనం వెల్లువ ప్రజలకు కనిపిస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందనుకున్నారేమో కానీ.. రాత్రికి రాత్రి పోలీసులకు అనుమతి రద్దు చేస్తున్నట్లుగా చెప్పుకున్నారు. దీనికి కారణం వైసీపీ నేతలు చెప్పే ఇరుకు సందుగా చెప్పుకొచ్చారు. అనుమతి ఇచ్చేటప్పుడు అది ఇరుకు సందని తెలియదా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు ఇష్టారీతిన ర్యాలీలు .. పోలీసుల సహకారంతో నిర్వహిస్తూంటే.. చంద్రబాబు, లోకేష్ పర్యటనలపై మాత్రం పోలీసులు తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు.