ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించ తలపెట్టిన చంద్రన్న విలేజ్ మాల్… ఒక పెద్ద గోల్ మాల్ అని విపక్ష పార్టీ విమర్శిస్తూన్న సంగతి తెలిసిందే. మరో వైపు వ్యాపార వర్గాలు కూడా వారితో గొంతు కలుపుతున్నాయ్.
హోల్ సేల్ ధరల్లో అందించే మాల్స్ కు వెళ్లలేని గ్రామీణుల కోసం ఈ చంద్రన్న విలేజ్ మాల్ లు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.వీటి వల్ల అధిక ధరలకు విక్రయించే షాప్స్ కు వెళ్లాల్సిన అగత్యం తప్పుతుంది అంటున్నారు రాయితీ ధరల్లో ఇక్కడ సరుకులు అందిస్తాం అంటోంది.
అయితే దీనిని విపక్ష పార్టీ నేత రోజా ఇప్పటికీ ఖండించారు. తాజాగా విజయవాడ కు చెందిన నేత మల్లాది విష్ణు సైతం ప్రభుత్వ వైఖరిని తప్పు బట్టారు రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపు ల వ్యాపారం పెంచడానికి మాత్రమే ఇవి పనికొస్తాయ్ అన్నారాయన. ఒక వైపు వీటి వెనుక ఉద్దేశ్యాలను తప్పు బడుతూ విపక్షాలు చేసే విమర్శలు అలా ఉంటే… వీటిలో ధరలు సైతం ప్రభుత్వం చెప్పిన విధంగా అందుబాటులో లేవని వార్తలు వస్తున్నాయి.
ఈ వాదనకు మద్దతు గా అన్నట్టు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం స్పందించింది. చాంబర్ ఆ కామర్స్ అధ్యక్షుడు ఆంజనేయులు గుంటూరు లో మాట్లాడుతూ… చంద్రన్న మాల్ గ్రామీణులకు నిరుపయోగం అన్నారు. ఇవి హోల్ సేల్ ధరల కు వస్తువులు విక్రయాలు చేయబోవడం లేదని ఆరోపించారు. పైగా ఇవి చిన్న చిన్న కిరాణా వ్యాపారుల జీవనాన్నీ దెబ్బ తీస్తాయని అభిప్రాయపడ్డారు.