చంద్రశేఖర్ యేలేటి అంటే మాంచి థ్రిల్లర్ సినిమాలు కళ్ల ముందు మెదుల్తాయి. ఐతే, అనుకోకుండా ఒకరోజు సినిమాలు తెచ్చిన పేరు ఆ తరువాత రకరకాల ఫార్మాట్లు ట్రయ్ చేసినా రాలేదు. ప్రయాణం లాంటి ప్రయోగాత్మక సినిమా కానీ, మనమంతా లాంటి మాంచి ఫీల్ గుఢ్ సినిమా కానీ జనాలకు పట్టలేదు. సాహసం సినిమా టీవీల్లో వీర హిట్ కానీ థియేటర్లో మాత్రం అంతంత మాత్రమే అయింది.
ఇలాంటి నేపథ్యంలో యేలేటి లేటెస్ట్ గా మరో సినిమా అనౌన్స్ చేసారు. భవ్య బ్యానర్ పై నితిన్ హీరోగా, రకుల్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా సినిమా ప్రకటించారు. ఇది మరో మూడు నెలల తరువాత మొదలవుతుంది. ఈ సినిమా తో మళ్లీ యేలేటి చంధ్రశేఖర్ తనకు అచ్చిన జోనర్ కు వచ్చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం మాంచి సస్సెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ను యేలేటి రెడీ చేసినట్లు తెలుస్తోంది. నితిన్ కూడా ఇలాంటి జోనర్ లో ఇప్పటి వరకు చేయలేదు. అందువల్ల సినిమా మీద కాస్త ఆశలు పెట్టుకోవచ్చేమో?