కార్తికేయతో సూపర్ హిట్ కొట్టాడు చందూ మొండేటి. ఇప్పుడు నాగచైతన్యతో ప్రేమమ్ తెరకెకెక్కిస్తున్నాడు. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా కూడా ఓకే అయిపోయింది. ఈసారి మెగా హీరోతో జట్టుకట్టబోతున్నాడు చందూ. వరుణ్ తేజ్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట చందూ. అది వరుణ్‌కి వినిపించడం, ఓకే అనిపించుకోవడం జరిగిపోయాయని టాక్. అతి త్వరలోనే ఈసినిమా పట్టాలెక్కబోతోంది. వరుణ్ చేతిలో రెండు సినిలున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’గా రాబోతున్నాడు. శేఖర్ కమ్ముల సినిమా ‘ఫిదా’ కూడా ఈమధ్యే మొదలైంది. మిస్టర్ పూర్తవ్వగానే చందూ మొండేటి సినిమాని పట్టాలెక్కిస్తారట. ఫాంటసీ జోనర్లోసాగే కథ ఇదని తెలుస్తోంది. కార్తికేయ తరహాలోనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ చేశారట. కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి.