ఆంధ్రప్రదేశ్ బీజేపీ పనితీరు అమిత్ షా వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్లినప్పటికీ మారకపోవడంతో సారధిని మార్చాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సోము వీర్రాజును తక్షణం ఢిల్లీ రావాలని పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశం రావడంతో ఆయన హస్తినకు వెళ్లారు. అంతా సీక్రెట్ పద్దతిలో సాగుతోంది. వైసీపీ ప్రభుత్వంపై ఎందుకు పోరాడలేకపోతున్నారన్న పద్దతిలో ఆయనపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు అధికారాలు కట్ చేశారు. కోర్ కమిటీని నియమించారు.
అయితే అసలు నాయకత్వమే సైలెంట్‌గా ఉంటూండటంతో కోర్ కమిటీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఆయనపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా తేలడంతోనే ఇటీవల ఆయన … ఇక రాజకీయాల్లో ఉండననే ప్రకటనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2024 తర్వతా రాజకీయ రిటైర్మెంట్ అని ఆయన ప్రకటించుకోవడం.. పార్టీ హైకమాండ్‌కు ఇప్పుడు తనను పదవి నుంచి తొలగించవద్దని సంకేతాలు పంపడమేనని అంటున్నారు. అయితే సోము వీర్రాజు పార్టీ కోసం ఏం చేశారన్న నివేదిక రెడీ చేస్తే…ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది ఒక్కటంటే ఒక్కటీ కనిపించడం లేదన్న అభిప్రాయం ఢిల్లీ నేతల్లో వినిపిస్తోంది.
ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్తున్న సమయంలో కన్నా లక్ష్మినారాయణను తొలగించి సోము వీర్రాజుకు చాన్సిచ్చారు. కానీ పూర్తిగా వైసీపీ అనుబంధంగా మార్చేశారు. అమరావతిపై మాట్లాడిన వారిని సస్పెంండ్ చేసి .. పార్టీలో చేరిన కొంత మంది నేతలను వైసీపీ తరహాలో కోవర్టులుగా చూస్తూ పార్టీని కోలుకోకుండా చేశారన్న అభిప్రాయం గట్టిగా ఉంది. అందుకే ఆయనకు ఫైనల్ క్లాస్ పీకడానికో.., పదవి నుంచి తప్పిస్తున్నామని చెప్పడానికో ఢిల్లీ పిలిపించారని భావిస్తున్నారు.