కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో సిద్దరామయ్యను తొలగిస్తారని..తామే సీఎం అన్న భావనలో ఓ పద మంది పార్టీ నేతలు చేస్తున్న పొలిటికల్ సర్కస్ రసరవత్తరంగా సాగుతోంది. సీఎం కుర్చీ ఖాళీ లేదని సిద్దరామయ్య పదే పదే చెబుతున్నారు కానీ ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. సీనియారిటి, సామాజిక సమీకరణాలు ఇతర కోణాల్ని తమకు అన్వయించుకుని తర్వాత తామే సీఎం అని కొందరు ప్రచారం చేసేసుకుంటున్నారు. ప నిలో పనిగా సిద్ధరామయ్యతో పాటు ఇతర పోటీదారులపై ఆరోపణలు చేస్తూ హైకమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పుడు డీకే శివకుమార్ కు సీఎం పదవి ఇస్తారనుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిద్ధరామయ్యకు చాన్సిచ్చారు. ఆ తర్వాత శివకుమార్ కుసీఎం పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. శివకుమార్ డిప్యూటీగా ఉన్నారు. అయితే ఆయనను సీఎం చేసే ఆలోచన హైకమాండ్ కు ఇప్పుడు ఉందో లేదో తెలియడం లేదు. ఇటీవల ఆయన ప్రధాని, అమిత్ షాలను రహస్యంగా కలిశారన్న ప్రచారమూ జరిగింది.
కర్ణాటక కాంగ్రెస్ లో పరిస్థితులపై డీకే శివకుమార్ .. అమెరికా వెళ్లి మరీ రాహుల్ గాంధీని కలిశారు. సిద్ధరామయ్య కు ప్రధాన సమస్యగా మైసూరు భూముల విషయంలో ఆయన పై వస్తున్న ఆరోపణలు మారాయి. అయితే అందులో తప్పేం జరగలేదని ఆయన అంటున్నారు. విపక్షాల కన్నా… ఈ విషయంలో సొంత పార్టీ వారే హైకమాండ్ కు ఫిర్యాదులు చేస్తూండటంతో సిద్దరామయ్యకు ఎక్కువ మైనస్ అవుతోంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కర్ణాటకలో పజిల్ గా మారింది. రాహుల్ ఏం చేస్తారో మరి