అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విశాఖపట్నం వెళ్లారు. గిరిజన గ్రామాల అభివృద్ధి నిమిత్తం చేస్తున్న ‘అడవితల్లి బాట’ కార్యక్రమానికి పెదపాడు గ్రామంలో ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మారుమూల పల్లెల్లో చేపట్టనున్న రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా డుంబ్రిగుడలో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడారు.”ఈ ప్రాంతంలో కూటమి పార్టీలకు ఓట్లు పడకపోయినా మీ బాగోగులు చూడటానికి మేం ఉన్నాం. ప్రభుత్వాలు, పార్టీలు మారుతుంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగాలి’అని పవన్ ప్రసంగించడం అక్కడి ప్రజలని ఆలోచింపచేసింది.
కాగా ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ చాలా హుషారుగా కనిపించారు. అక్కడి ప్రజలతో కలసి నడిచారు. స్థానికలతో కూర్చుని మాట్లాడారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ లుక్ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆయన కాస్త నాజూకుగా కనిపించారు. ఫేస్ కాస్త లీన్ గా అనిపించింది. పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్ డైట్లు చేస్తుంటారు. వారాల వ్యవధిలో ఆయన లుక్ లో మార్పులు రావడం ఇది వరకు గమనించినదే. ఈ పర్యటనలో కూడా ఆయన లుక్ లో స్వల్ప మార్పు వచ్చింది. పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు వున్నాయి. ముఖ్యంగా ఓజీ పై ఫ్యాన్స్ కి చాలా అంచనాలు వున్నాయి. ఓజీ షూట్ కోసమే పవన్ ప్రీపేర్ అవుతుంటే ఫ్యాన్స్ కి అంతకంటే ఏం కావాలి.