మహేష్ – పరశురామ్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `సర్కారువారి పాట`. కథానాయకగా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అమెరికాలో చిత్రీకరణ మొదలు కానుంది. ప్రస్తుతం పరశురామ్ అమెరికాలోనే ఉన్నాడు. లొకేషన్ల వేట కొనసాగిస్తున్నాడు. ఈలోగా.. ఈ టీమ్ లో ఓ కీలకమైన మార్పు జరిగింది. ఈ చిత్రానికి కెమెరామెన్ గా పి.ఎస్. వినోద్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో మది వచ్చి చేరారు.
పీ.ఎస్ వినోద్ ప్రస్తుతం `వకీల్ సాబ్` కోసం పనిచేస్తున్నారు. సర్కారువారి పాట మొదలయ్యే సరికి వకీల్ సాబ్ సినిమా పూర్తవుతుందనుకున్నారు. కానీ.. లాక్ డౌన్ వల్ల అది సాధ్యం కాలేదు. అతి త్వరలో వకీల్ సాబ్ సినిమా మొదలవుతుంది. ముందు ఆ సినిమా పూర్తి చేయాలి. సరిగ్గా అదే సమయంలో అమెరికాలో `సర్కారు వారి పాట` మొదలెట్టాలి. రెండు సినిమాల్ని ఒకేసారి చేయడం అసాధ్యం. అందుకే.. సర్కారువారి పాట నుంచి ఆయన తప్పుకున్నారు. ఆ స్థానంలో మది అమెరికా ఫ్లైట్ ఎక్కారు.