తెలంగాణలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎవరూ విజయం సాధించకపోవడంతో… ఏపీలో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకూడదన్న ఆలోచన లో జగన్ రెడ్డి ఉన్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నలుగురిలో అత్యంత బలహీన నాయకుడు అయిన మద్దాలి గిరికి టిక్కెట్ నిరాకిరంచారు. ఆయనకు కనీసం సమాచారం కూడా లేకుండా విడదల రజనీని ఇంచార్జ్ గా నియమించారు. దాంతో ఆయన ఆర్యవైశ్య సంఘాల పేరుతో బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వల్లభనేని వంశీకి కూడా అవే సూచనలు వెళ్తున్నాయి. గత వారంలో రెండు, మూడు సార్లు వల్లభనేని వంశీతో వైసీపీ పెద్దలు మాట్లాడారు. నేరుగా కాకపోయినా పరోక్షంగా అయినా గన్నవరం టిక్కెట్ ఇవ్వడం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం వల్లభనేని వంశీకి అర్థమయిందంటున్నారు. ఆయనేం చేస్తారన్నది ఇంకా అంతుబట్టడం లేదు. ఇప్పుడు కారణం బలరాం కృష్ణమూర్తికీసంకేతాలు పంపుతున్నారు. ఒంగోలు నుంచి పోటీ చేయాలని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ అది ఉత్తదేనని చివరికి హ్యాండిస్తారనివారికీ తెలుసు. అందుకే వారు ఇప్పుడు సీటు కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పరిస్థితి ఎప్పుడో తేడాగా మారింది.
అయితే మధ్యలో జగన్ మళ్లీ బుజ్జిగంచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇక అసలు పట్టించుకోవాల్సిన అసరం లేదన్నట్లుగా వైసీపీ హైకమాండ్ వ్యవహరించనుంది. దీంతో ఆయనకూ టిక్కెట్ నిరాకరించడం ఖాయమవుతోంది. ఈ నలుగురి రాజకీయ భవిష్యత్ ను జగన్ రెడ్డి క్లోజ్ చేసేశారని టీడీపీలో సెటైర్లు వినపిస్తున్నాయి.