నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు అంటే.. ఆయనను కామెడీ చేయాలని వందల మందితో సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది వైసీపీ. వారికి ఇంటలిజెన్స్ పోలీసు వ్యవస్థ మొత్తం సహకరించింది. ఉన్నత చదువులు చదువుకున్న లోకేష్ రాజకీయాల్లోకి వస్తే.. రౌడీయిజం తెలియదు.. జగన్ రెడ్డిలా చదువు మధ్యలో ఆపేసి రౌడీయిజం ఇమేజ్ తెచ్చుకోలేదు కాబట్టి ఆయన సాఫ్ట్..రాజకీయాలకు పనికి రాడని ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. ఇందు కోసం ఎన్నెన్ని కుట్రలు చేశారో లెక్క లేదు. చాలా వరకూ సక్సెస్ అయ్యారు కూడా.
ఇప్పుడు లోకేష్ అన్ని ఆటంకాలను అధిగమించిన నాయకుడు !
కానీ లోకేష్ ఆ ఆటంకాలను ఎదుర్కొని.. తనను తను నిరూపించుకంటూ వస్తున్నారు. బాగా చదువుకున్నా.. . నిజంగా నాయకుడు అంటే అలా ఉండాల్సిందే అని ప్రజల మనసుల్లో ముద్ర వేసినట్లుగా మారేందుకు ప్రయత్నించారు. కానీ అది కూడా తనదైన పద్దతిలోనే. దూకుడుగా మాట్లాడినా.. దౌర్జన్యంగా చేసినట్లుగా అనిపించినా… తప్పును ఎదుర్కొనే విషయంలో తగ్గనని నిరూపించేలాగానే మారిపోయారు. తాను నీట్ గా షేవ్ చేసుకున్నంత మాత్రాన చేతకానివాడిని కాదని.. తన వేష, భాషలే కాదు.. మాటలను కూడా మార్చి నిరూపించారు. ఒకప్పుడు చిన్న మాట తడబడితే… ట్రోల్ చేయడానికి వేల మంది రెడీగా ఉండేవారు. ఇప్పుడు లోకేష్ వారికి అలాంటి అవకాశం ఇవ్వడం లేదు.. కొసమెరుపేమిటంటే జగన్ రెడ్డి నోరు తెరిస్తే కాస్తో ఇస్తిస్కోలు లెక్కలేనన్ని . ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా సైన్యం పండగ చేసుకుంటోంది.
తనపై చేసిన తప్పుడు ప్రచారాలకు సమాధానాలిచ్చిన నాయకుడు!
నారా లోకేష్ ఇమేజ్ ను.. యువగళం పాదయాత్ర పూర్తిగా మార్చేసింది. కుప్పం నుంచి ప్రారంభమైన యాత్ర సాఫీగా సాగలేదు. అనేక ఆటంకాలు సృష్టించి… యువగళానికి ఓ క్రేజ్ తీసుకు వచ్చారు జగన్ రెడ్డి. చివరికి మైకులు.. నిలబడేందుకు ఉపయోగించుకునే స్టూల్ కూడా లాగేసుకున్నారు. కానీ యువగళాన్ని మాత్రం నొక్కేయలేకపోయారు. చివరికి చంద్రబాబును అరెస్ట్ చేసి.. ఏదో సాధించామనుకున్నారు..కానీ లోకేష్‌ను నేషనల్ లెవల్లో పాపులర్ చేశారు. ఆయన ఢిల్లీలో వ్యవహారాలను ఒంటి చేత్తో చక్కబెట్టగలరన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు. ఆయన నాయకత్వ సామర్త్యంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచారు.
తన సామర్థ్యాన్ని ప్రజల ముందు ఆవిష్కరించుకున్న నాయకుడు !
ఇచ్చాపురం దాకా చేయాలనుకున్నపాదయాత్రను భీమిలి వరకే చేసేలా చేయడం ఒక్కటే జగన్ రెడ్డి సాధించింది. కానీ దీని వల్ల ఆయనకు లాసా లాభమా అన్నది ఇప్పటికే వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. లోకేష్ ను అదే పనిగా టార్గెట్ చేసి చేసి మాస్ లీడర్ గా నిలబెట్టడంలో జగన్ రెడ్డి తన వంతు పాత్ర పోషించారు.
ఇప్పుడు లోకేష్.. అన్నింటినీ అధిగమించిన నాయకుడు… తనపై వందల కోట్లు వెచ్చించి చేసిన తప్పుడు ప్రచారానికి సమాధానాలిచ్చిన నాయకుడు.. తాను చెప్పింది చేస్తానని ధైర్యంగా చెప్పగలిగే నాయకుడ్నని శిలాఫలకాల సాక్షిగా ఆవిష్కరించుకున్న నాయకుడు… ఈ నాయకుడ్ని తీర్చిదిద్దింది యువగళమే. !