వ్యక్తిగత ఆదాయ పన్నుల్లో మార్పులు ఉంటాయా…? నిర్మలమ్మ ఇప్పటికైనా కరుణిస్తుందా….? అన్న నిరీక్షణకు తెరపడింది.
స్వల్ప మార్పులతోనే ఆదాయ పన్ను శ్లాబ్ లకు పుల్ స్టాప్ పడింది. మూడు లక్షల వరకు ఆదాయం ఉన్న వరకు ఎలాంటి పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. మూడు లక్షల నుండి ఏడు లక్షల ఆదాయం మధ్యలో ఉన్న వారు 5శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది.
Also Read : దటీజ్ బాబు.. అమరావతికి బడ్జెట్లో నిధులు!
ఇక 7 నుండి 10లక్షల ఆదాయం ఉన్న వారు 10శాతం పన్ను, 10 నుండి 12లక్షల మధ్యలో ఆదాయం ఉన్న వారు 15శాతం, 12లక్షల నుండి 15లక్షల ఆదాయం ఉన్న వారు 20శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. 15లక్షల ఆదాయం పైబడిన వారికి 30శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఇక కొత్త పన్ను శ్లాబులు ఎంచుకున్న వారికి స్టాండర్డ్ డిడక్షన్ ను 50వేల నుండి 75వేలకు పెంచుతూ కాస్త ఊరటనిచ్చారు.