భారత జాతీయ చిహ్నం గురించి చిన్నప్పటి నుంచి చూస్తూంటాం. నాలుగు సింహాలు.. కింద అశోకచక్రం ఉన్న గుర్తును జాతీయ చిహ్నంగా గుర్తించారు. అది అధికారికం. అయితే తాజాగా దానిలో మార్పు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాము కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనం పైన ఈ జాతీయ చిహ్నాన్ని భారీ సైజులో ఏర్పాటు చేశారు. దాన్ని ఆయన ఆవిష్కరించారు.
అదిపార్లమెంట్ కాబట్టి స్పీకరే పెద్ద అని ఆయన చేయాల్సిన కార్యక్రమాన్ని మోదీ చేశారనే విమర్శలను పక్కన పెడితే అసలు జాతీయ చిహ్నం మారిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. పాత జాతీయ చిహ్నంలో సింహాలు మామూలుగా ఉంటాయి. అంటే గర్జిస్తూ ఉండవు. కానీ మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలో మాత్రం స్పష్టంగా మార్పులుకనిప్సతున్నాయి. సింహాలు గర్జిస్తూ కనిపిస్తున్నాయి. దీంతో దుమారం ప్రారంభమయింది.
చరిత్రను మార్చేస్తున్నట్లుగా జాతీయ చిహ్నాలనూ మార్చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. ఎక్కడా మార్పు లేదని కానీ.. చిన్న చిన్న మార్పులు చేశామని కానీచెప్పలేదు. కానీ పార్లమెంట్ భవనంపైన ఇలాంటి విగ్రహం పెట్టారు కాబట్టి… కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే..ప్రజల్లో గర్జిస్తున్న సింహమే నిజమైనా ఎంబ్లం అనుకునే ప్రమాదం ఉంది.