నిజమే… సమంత సినిమా క్లైమాక్స్ మారుతోంది. కన్నడ హిట్ ‘యూ టర్న్’ చూసేసిన ప్రేక్షకులు తెలుగులో సినిమా చూసేటప్పుడు థ్రిల్ మిస్ అవుతామేమోనని నిరాశ పడాల్సిన పని లేదు. ఒరిజినల్‌కి, తెలుగు రీమేక్‌కి తేడా వుంటుందని చిత్ర దర్శకుడు పవన్‌కుమార్ చెబుతున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో విలేకరిగా నటించిన కన్నడ సినిమా ‘యూ టర్న్’. ఈ థ్రిల్లర్ సిన్మాను సమంత ముఖ్యతారగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించిన పవన్‌కుమార్ తెలుగు వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే… కన్నడ సినిమాకి, తెలుగు సినిమాకి కొన్ని మార్పులు చేశార్ట. ముఖ్యంగా క్లైమాక్స్‌ని మొత్తం మార్చేశార్ట. తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుందని దర్శకుడు పవన్‌కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సమంతపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.