బీఆర్ఎస్ రాజకీయాలు పొలిటికల్ గ్రౌండ్ లో మరీ కామెడీగా మారుతున్నాయి. పార్టీని కాదని వెళ్లిన ఎమ్మెల్యేను తిరిగి చేర్చుకోవడం ద్వారా అధికారం సాధించామన్న ఫీల్ ను అనుభవిస్తున్నారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యే చేరడం సంచలనమే. కానీ, ఆయనేదో కాంగ్రెస్ విధానాలు నచ్చక.. బీఆర్ఎస్ తోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని కారెక్కేలేదు. అదంతా వ్యక్తిగత అవసరాల కోసం.
బీఆర్ఎస్ మాత్రం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను ఓ రేంజ్ లో ప్రచారం చేసుకుంటుంది. నిజానికి వరుస షాకులతో సతమతం అవుతున్న బీఆర్ఎస్ కు బండ్ల రివర్స్ చేరిక కొంత ఊరటనిచ్చిదే. కానీ, ఆ పార్టీ దీనిని ప్రచారం చేసుకుంటున్న విధానమే బీఆర్ఎస్ ను నవ్వుల పాలు చేస్తోంది.
Also Read : అసెంబ్లీ ఆవరణలోనే రుణమాఫీ ఎందుకు..ఇదేనా అసలు వ్యూహం?
బండ్ల చేరికతో మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు అంటూ తెలివిగా ప్రచారం చేసుకుంటుంది..అయితే బండ్ల మినహా మరే ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో చేరాలనే ఆలోచనలో లేరు. కానీ, బీఆర్ఎస్ నేతలు మాత్రం ఒక్క చేరికను ముందుంచి ఏదో జరగబోతుంది అన్న ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇది పార్టీకి అవసరం అనుకుంటున్నారు…కానీ కామెడీ అవుతుంది అన్న సంగతి గుర్తిస్తే మంచిది.