మీడియా వర్గాలకు ఆసక్తికరమైన వార్త ఇది. దేశంలోని టీవీ ఛానళ్ల చైర్మన్లతో అంటే అధినేతలను మోడీ ప్రభుత్వం ఇష్టాగోష్టి జరపనుంది. మే 28న ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో బిజెపి అద్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పాల్గొంటున్నారు. మూడవ వార్షికోత్సవం జరుపుకొంటున్న మోడీ సర్కారు ప్రచార వ్యూహం గురించి వేరుగా చెప్పవనసరం లేదు. సంపాదకులు సిఇవోలు కాకుండా నేరుగా యజమానులను కలుసుకుంటే తమ సందేశం స్పష్టంగా చెప్పొచ్చని బిజెపి ఆలోచనగా వున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ ఆహ్వానం అందరికీ పంపించారని కూడా చెప్పడానికి లేదు. బహుశా దశలవారిగా పిలుస్తామనే పేరుమీద మొదట తమకు అనుకూలమైన లేదా తటస్థమైన ఛానళ్లతో ముచ్చటించవచ్చు. మీడియాలో పోటీ ఫలితంగా ఏర్పడిన ఒత్తిళ్లను బార్క్ రేటింగులో సమస్యలను కేంద్రం దృష్టికి తెచ్చే అవకాశం వుంది. గతంలో మన్మోహన్ సింగ్ కూడా తన ప్రభుత్వంపై ఆరోపణలు ముమ్మరంగా వున్నప్పుడు ఛానళ్ల సిఇవోలను పిలిపించి విమర్శలు తగ్టించమని వేడుకున్న సంగతి గుర్తుండే వుంటుంది.