ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తున్నాయని… కొన్ని చానళ్లను బ్యాన్ చేసిన ఘటన.. హైకోర్టుకు చేసింది. ఓ న్యాయవాది.. ఈ వ్యవహారంపై.. హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు… ట్రాయ్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను.. ఎల్లుండికి వాయిదా వేసింది. దీంతో.. ఈ వ్యవహారంలో.. కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం.. ఫ్రీ టు ఎయిర్ చానళ్లు 75 ప్రేక్షకులకు ఉచితంగా ఇవ్వాల్సిందే. న్యూస్ చానళ్లు కూడా ఫ్రీ చానళ్లే. నిన్నామొన్నటి వరకూ ఆ చానళ్లను ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వ హెచ్చరికల కారణంగా నిలిపివేశారు. దీంతో.. ఆయా మీడియా సంస్థలు ట్రాయ్ కు ఫిర్యాదు చేయమని ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తున్నాయి.
ట్రాయ్‌కు ఫిర్యాదు చేసిన వారికి మాత్రం.. కేబుల్ ఆపరేటర్లు… టీవీ చానళ్లను పునరుద్ధరిస్తున్నట్లుగా చెబుతున్నారు. చేయని వారికి మాత్రం… కేబుల్ ఆపరేటర్లు పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో ట్రాయ్ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. కొత్త విధానం అమలులోకి వచ్చినప్పుడు.. ప్రతీ ఖాతాదారు వద్ద.. తమకు ఏమేం చానళ్లు కావాలో జాబితా తీసుకోవాలని ట్రాయ్ నిర్దేశించింది. కానీ ఎవరూ తీసుకోలేదు. ఇదే వారికి ఇప్పుడు ఇబ్బందికరంగా మారనుంది. ఆ చానళ్లు ప్రేక్షకులకు కోరుకోలేదని.. కేబుల్ ఆపరేటర్లు వాదించడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని.. న్యాయనాద వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి న్యూస్ చానళ్లు కానీ.. ఇతర చానళ్లు కానీ… కేబుల్ ఆపరేటర్ల ప్రమేయం ఉండకూడదన్న లక్ష్యంతోనే.. ట్రాయ్ కొన్ని నిబంధనలు తెచ్చింది. దాని ప్రకారం.. ఏ చానల్ ను ఉద్దేశపూర్వకంగా… ఆపడానికి అవకాశం లేదు. గతంలో… తెలంగాణలో ఏబీఎన్, టీవీ9ను నిలిపివేసినప్పుడు కూడా… కోర్టు తీర్పుతోనే.. ప్రసారాలు పునంప్రారంభమయ్యాయి. ఇప్పుడు.. న్యాయవాది దాఖలు చేసిన పిల్ పై… ట్రాయ్ … దాఖలు చేసే.. కౌంటర్… ఆధారంగా… కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.