మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ బ్రూస్ లీ అనుకున్నంత సక్సెస్ కాకపోయే సరికి దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాడు. కొన్ని ఏరియాల్లో బ్రూస్ లీ బాగా దెబ్బేసిందని టాక్. అయితే బ్రూస్ లీలో చిరు నటించడం రైటర్లు, సినిమా బాగా ఎత్తడం చూసి డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎమౌంట్ కి కొన్నారు. మరి ఇప్పుడు ఆ నష్టాన్ని ఎవరి భరించాలని ఫీల్ అవుతున్నారు. అందుకే చరణ్ వారికి అద్భుతమైన ఆఫర్ ని ఇచ్చాడు.
బ్రూస్ లీ సినిమా ఎవరైతే కొన్నారో వారికే తను తర్వాత చేస్తున్న తమిళ సినిమా తని ఒరువన్ రీమేక్ సినిమాను కూడా ఇస్తున్నాడట. అది కూడా చాలా రీజనబుల్ రేట్ కే చెర్రి బయ్యర్లకు ఇస్తున్నాడని టాక్. సురేందర్ రెడ్డి డైరక్షన్లో తెరకెక్కనున్న ఆ సినిమాలో చరణ్ తో మొదటిసారి రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుంది సమంత. ఒకరకంగా చరణ్ తీసుకున్న ఈ డెసిషన్ తో బయ్యర్లంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు.
సినిమా లాభనష్టాలు మనకెందుకు మన డబ్బు మంకొచ్చింది అని ఆలోచించకుండా బయ్యర్లను ఆదుకోవడం చూసి చరణ్ ని అందరు అభినందిస్తున్నారు. మరి బ్రూస్ లీ ఎలాగు నిరాశ పరించింది తని ఒరువన్ తెలుగు సినిమా అయినా చరణ్ కి మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు.