ఆర్.ఆర్.ఆర్తో అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకొన్నాడు రామ్ చరణ్. నాటు నాటు పాట ఆస్కార్‌కి వెళ్లడంతో… చరణ్‌కి మరింత గుర్తింపు దక్కింది. చరణ్ ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నాడు. పలు ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఎక్కడకు వెళ్లినా చరణ్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. చరణ్ పలు హాలీవుడ్ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా హాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు? అనే ప్రశ్న ఎదురైంది. `త్వరలోనే.. అందుకు రంగం సిద్ధం అవుతోంది..` అంటూ.. హాలీవుడ్ ఎంట్రీ గురించి హింట్ ఇచ్చేశాడు చరణ్.
”నటుడిగా నాకు భాష, ప్రాంతాలతో సంబంధం లేదు. అన్ని దేశాల చిత్రాలలోనూ నటించాలని ఉంది. త్వరలోనే నా హాలీవుడ్ ఎంట్రీ సినిమాకి సంబందించిన విషయం చెబుతా. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి” అంటూ బదులిచ్చాడు చరణ్. అంతే కాదు… టెర్మినేటర్, గ్లాడియేటర్, బ్రేవ్ హార్ట్ చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని, ఆ జోనర్లో కథ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ”జూలియా రాబర్ట్స్ నా అభిమాన నటి. ఆమెతో కలిసి అతిథి పాత్రలో అయినా సరే.. నటించాలని ఉంది” అని హాలీవుడ్ లేడీ సూపర్ స్టార్‌పై తన అభిమానం ప్రదర్శించాడు. చరణ్ మాటలు చూస్తుంటే.. తనకేదో భారీ హాలీవుడ్ ప్రాజెక్ట్ వచ్చినట్టే కనిపిస్తోంది. త్వరలో ఆ కబురు వినిపిస్తాడేమో చూడాలి.