చిరు తనయుడు `చిరుత`గా చిత్రసీమలో అడుగుపెట్టాడు రామ్ చరణ్. చిరు ముందు చూపు, ఆలోచనా విధానం, జడ్జిమెంట్ చరణ్‌కి బాగా ఉపయోగపడింది. చరణ్ ఏ కథ చేయాలన్నా… ముందు అది చిరు వినాల్సిందే. చరణ్‌కి నచ్చినా, చిరుకి నచ్చకపోవడం వల్ల చాలా కథలు పట్టాలెక్కలేదు. సినిమా పూర్తయ్యాక కూడా చిరు ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సర్దుబాటు చేసిన సినిమాలెన్నో ఉన్నాయి. సినిమా కొబ్బరికాయ కొట్టుకున్న తరవాత కూడా చిరు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం.. ఆ తరవాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం – చరణ్ కెరీర్లో జరిగాయి.
అయితే చరణ్ ఇప్పుడు ఎదిగాడు. తప్పొప్పుల వల్ల పాఠాలు నేర్చుకున్నాడు. అనుభవాన్ని సంపాదించాడు. ఇప్పుడు చరణ్‌కి తెలుసు.. ఏ కథ చేయాలో? ఎలాంటి దర్శకుడ్ని ఎంచుకోవాలో. అందుకే చరణ్ తన కథల్ని తానే ఎంచుకుంటున్నాడు. విచిత్రం ఏమిటంటే.. చిరు ఎలాంటి సినిమాలు చేయాలో కూడా డిసైడ్ చేస్తున్నది చరణే. చిరు రీ ఎంట్రీ, ఆ తరవాత చేస్తున్న సినిమాలు అన్నీ చరణ్ కనుసన్నల్లోనే సాగుతున్నాయి. `సైరా` ప్రాజెక్టుకి తెర వెనుక చరణ్ చాలా కష్టపడ్డాడు. నిర్మాత గా కాకుండా. చిరు చేతిలో నాలుగు సినిమాలున్నాయి. `ఆచార్య`తో పాటు లూసీఫర్, వేదాళం రీమేక్‌లు చిరు చేస్తున్నాడు. బాబి కథ కూడా ఓకే అయ్యింది. ఈ నాలుగు సినిమాలూ చరణ్ ప్లానింగ్ ప్రకారమే సాగుతున్నాయి. బాబి, మెహర్ రమేష్ కథల్ని ముందు ఓకే చేసింది చిరు కాదు. చరణే. ఆ తరవాతే.. ఇవి చిరు విన్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తిగా చరణ్ చేతుల మీదుగా జరుగుతున్నాయట. `ఆచార్య` టీమ్ నుంచి త్రిష వెళ్లిపోయి కాజల్ రావడం వెనుక.. చరణ్ ప్రమేయం ఉందన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. ఇప్పుడు చిరుతో ప్రాజెక్టు చేయాలనుకుంటున్న వాళ్లంతా ముందు చరణ్ అప్పాయింట్ మెంట్ తీసుకుంటున్నారు. అలా.. సీన్ రివర్స్ అయిపోయింది. ఇది వరకు చిరు కథల్ని ఒకే చేసే బాధ్యత, ప్రాజెక్టుల్ని సెట్ చేసే పనులన్నీ అల్లు అరవింద్ చూసుకునేవారు. ఇప్పుడు బాధ్యతలన్నీ చరణ్ మీద పడ్డాయి. అంతే.