డేరింగ్ అండ్ డాషింగ్ ఛార్మింగ్ గాళ్ దర్శకత్వం చేయనుందా? త్వరలో కెప్టెన్ కుర్చీలో కూర్చోబోతోందా?? ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి మరి! జ్యోతిలక్ష్మి సినిమాకి ముందు నుంచీ పూరి జగన్నాథ్ కాంపౌండ్‌లో సెటిల్ అయిపోయిన ఛార్మి.. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చి దూరం జరిగింది. ఇప్పుడు మళ్లీ పూరి కాంపౌండ్లోనేఉంటోంది. నందమూరి బాలకృష్ణతో తెరకెక్కిస్తున్న `పైసా వసూల్`కి పూరి దాదాపుగా ఓ కో – డెరెక్టర్ రేంజులో పని చేసింది. స్క్రిప్టు వర్క్ నుంచి – గుమ్మడి కాయ కొట్టేంత వరకూ పూరితోనే ప్రయాణం చేసింది. టెక్నీషియన్ల లిస్టులో ఛార్మి పేరు కూడా కనిపించబోతోందట. ఛార్మితో పూరి ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని, పూరి ఈ సినిమాకి నిర్మాత కాకపోయినా – డమ్మీ ప్రొడ్యూసర్‌తో, ఛార్మి దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఛార్మిని నిర్మాతగా మార్చింది పూరినే. ఇప్పుడు దర్శకుడిగానూ ఆఫర్ ఇవ్వబోతున్నాడన్నమాట. ఆ సినిమాకి పూరినే కథ అందించే అవకాశాలున్నాయి. మరి.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.