నటన కంటే నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెట్టింది ఛార్మీ కౌర్. దర్శకుడు పూరి జగన్నాథ్ తీసే సినిమాల నిర్మాణంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఛార్మీ, పూరి కనెక్ట్స్ కాస్టింగ్ ఏజెన్సీ పనులూ ఆమె చూసుకుంటోంది. దాంతో మీడియా ముందుకు రావడం తగ్గించేసింది. ఆమెకు సంబంధించిన అప్డేట్స్ ఏవీ పెద్దగా బయటకు రావడం లేదు. దాంతో ఒక్కసారిగా ఎడమ చేతికి పెద్ద కట్టుతో కనిపించేసరికి ‘ఛార్మీకి ఏమైంది?’ అని చర్చించుకోవడం ప్రేక్షకుల వంతు అయ్యింది. బాలకృష్ణ ‘పైసా వసూల్’లో ఒక కథానాయికగా నటించిన ముస్కాన్ సేథీ ఇన్స్టాగ్రామ్లో ‘గెట్ వెల్ సూన్ మేడమ్’ అంటూ ఛార్మీతో దిగిన ఈ ఫొటోను పోస్ట్ చేసింది. గురువారం హైదరాబాద్లో ముస్కాన్ సేథీ స్పెషల్ ఫోటోషూట్ చేసింది. అప్పుడామెను ఛార్మీ కలిసిన సందర్భంలో తీసిన ఫొటో ఇది. ఛార్మీ చేతికి గాయం ఎలా అయ్యిందో మరి!