జ్యోతిలక్ష్మితో నిర్మాతగానూ మారిపోయింది ఛార్మి. పైసా వసూల్ సమయంలో అన్నీ తానై చూసుకుంది. ఇప్పుడూ అంతే. మెహబూబాకి తనే నిర్మాణ బాధ్యతల్ని చూసుకుంది. ప్రొడక్షన్ వ్యవహారాల్లో ఛార్మి చూపిస్తున్న చాతుర్యం గురించి… పూరి కూడా బహిరంగంగానే మెచ్చుకుంటున్నాడు. పూరి కనెక్ట్స్ అనే సంస్థ పేరుతో.. పూరి సినిమాలు తీస్తున్నా – ఆ బాధ్యతలన్నీ ఛార్మీనే చూసుకుంటుందిప్పుడు. మెహబూబా ప్రమోషన్ల విషయంలోనూ పూరి ఏమాత్రం కలగజేసుకోవడం లేదు. అదంతా ఛార్మీ ప్లానింగులోనే జరుగుతోంది. ప్రధాన పత్రికలు, టీవీ మీడియాకు ఛార్మి టచ్‌లో ఉంది. ఈ సినిమా దిల్‌రాజు చేతుల్లో పెట్టడం వెనుక ఛార్మి నే ప్రధాన కారణమని తెలుస్తోంది. మెహబూబా తరవాత.. పూరి కనెక్ట్స్ ద్వారా పూరి మరో సినిమా చేయబోతున్నాడు. దీనికి కూడా ఛార్మినే నిర్మాత. కాస్టింగ్‌కి సంబంధించిన అన్ని వ్యవహారాలూ ఛార్మినే చూసుకోబోతోంది. ఛార్మికి ఈమధ్య కొన్ని ఆఫర్లు వచ్చినా, వాటిని సైతం పక్కన పెట్టి పూరి కనెక్ట్స్‌తో బాగా కనెక్ట్ అయిపోయింది. ఇక మీదట ఛార్మిని నిర్మాతగానే చూడగలమేమో.