అలనాటి యాక్ట్రెస్ కమ్ డైరక్టర్ రేవతి మరోసారి తన పెన్నుకు పని చెప్పి ఓ అద్భుతమైన కథ సిద్ధం చేసిందట. ఆ సినిమాకు పూరి డైరక్షన్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాడు ఇదంతా బాగానే ఉంది కాని దీనికి ప్రొడ్యూసర్ గా హాట్ హీరోయిన్ ఛార్మి పేరు వినిపిస్తుంది. అసలే జ్యోతిలక్ష్మి తర్వాత ఆఫర్లేమీ లేక విలవిలలాడిపోతున్న అమ్మడు ఇలా సడెన్ గా నిర్మాత ఏంటని అందరు ఒకింత షాక్ కి గురవుతున్నారు. జ్యోతిలక్ష్మి సినిమాకే తను నిర్మాత భాధ్యతను అందుకుని దెబ్బతిన్న ఛార్మి మరోసారి ఆ ప్రయత్నం చేయడం ఎంతవరకు సేఫ్ అన్నది ఆలోచించాలి.
అయితే హీరోయిన్ గా ఎలాగూ దాదాపు కెరియర్ ముగిసినట్టే ఏదో అడపాదడపా ఐటం సాంగ్ అని.. సైడ్ హీరోయిన్ అనే ఛాన్సులు వస్తున్నాయి.. అందుకే అమ్మడు ఇక పూర్తిగా నిర్మాణ రంగం మీద ఫుల్ ఫోకస్ పెట్టబోతుందనుకుంట. రేవతి కథకి తను కూడా ఫ్లాట్ అయ్యిందట. అందుకే కష్టమైనా సరే ప్రొడ్యూస్ చేస్తా అని అంటుంది.
తెలుస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా చేస్తాడని అంటున్నారు. రీసెంట్ గా సినిమా చూపిస్త మావ హిట్ కొట్టిన ఈ హీరో ఫుల్ ఫాంలో ఉన్నాడని చెప్పొచ్చు. ఓ పక్క సుకుమార్ కుమారి 21ఎఫ్ లో కూడా ఈ కుర్ర హీరోనే హీరో. మరి ఛార్మి నిర్మాతగా చేస్తున్న ఈ రెండో ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.