హీరో క్యారెక్టరైజేషన్ ని బట్టి కథలు తయారు అవుతున్నాయి. క్యారెక్టర్ ఎంత ఇంట్రస్ట్రింగ్ గా ఉంటే అంత కిక్కు. `చావు కబురు చల్లగా`లో కార్తికేయ క్యారెక్టర్ అయితే… ఇంట్రెస్ట్రింగ్ గా, మహా మాసీగా కనిపిస్తోంది. ఇందులో బస్తీ బాలరాజుగా కనిపించబోతున్నాడు కార్తికేయ. ఈ రోజు కార్తికేయ పుట్టిన రోజు ఈ సందర్భంగా… ఓ టీజర్ ని వదిలారు.
శవాల్ని స్మాశానాలకు తీసుకెళ్లే వ్యానుకి డ్రైవరు బాలరాజు. రోజూ ఏడుపులు చూసీ చూసీ.. ఏడుంటంటే విరక్తి పుట్టుకొస్తుంది. చావులకు వెళ్లి కూడా అక్కడ అమ్మాయిలకు, మొగుడు పోయిన పెళ్లాలకు లైన్లు వేసి, వాళ్లని దారిలో పెడుతుంటాడు. ఇదీ… బాలరాజు క్యారెక్టరు. టీజర్ చూస్తే… బాలరాజు ఏం చేస్తాడో అర్థమైపోతుంది. ఈ క్యారెక్టర్ ద్వారా కావల్సినంత ఫన్ క్రియేట్ చేస్తున్నాడన్న విషయం టీజర్ లోనే చెప్పారు. కాకపోతే.. డైలాగులు చూస్తుంటే కాస్త మసాలా కూడా బాగానే దట్టిస్తున్నారేమో అనిపిస్తోంది. బాలరాజుగా కార్తికేయ లుక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్.. ఇవన్నీ ఈ సినిమాపై ఆసక్తి కలిగిస్తున్నాయి. లావణ్య త్రిపాఠీ కథానాయికగా నటిస్తోంది. కౌశిక్ దర్శకుడు.