నాగచైతన్య, చందూ మొండేటి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ పనులు మొదలయ్యాయి. నాగచైతన్య, చందు, బన్నీ వాసు తాజాగా శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామంలో పర్యటించచారు. వర్క్ షాపులు కూడా నిర్వహించారు. ప్రీప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి.
రేపు చైతు బర్త్ డే. ఈ సందర్భంగా సినిమా టైటిల్ రివిల్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘తండేల్ అనే టైటిల్ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో చైతు కొత్త లుక్ లో కనిపించారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు చైతు. ఆ మార్పు ఫస్ట్ లుక్ లో కనిపించింది. కండలు తిరిగిన దేహం, గుబురు గడ్డంతో మాస్ లుక్ లో కనిపించారు. యదార్థ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. కథలో కొంత భాగం పాకిస్తాన్ లో కూడా చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.