ఇల్లు కొనుగోలుదారులను బిల్డర్లు రకరకాలుగా మోసం చేస్తూంటారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం.. సర్వే నెంబర్లు తప్పులు చెప్పడం దగ్గర నుంచి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కట్టి అమ్మడం వరకూ చాలా ఉంటాయి. అందుకే తాము ఇళ్లు కొనేటప్పుపుడు ఇలాంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి వినియోగదారులు. వాటితోపాటు ఇళ్ల కొనుగోలు చూసుకోవాల్సిన మరో అంశం గ్రీన్ బెల్ట్.
గ్రీన్ బెల్ట్ కోసం రిజర్వ్ చేసిన భూమిలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టడానికి వీల్లేదు. నీటి వనరులను సంరక్షణలో కోసం గ్రీన్ బెల్ట్ ను రిజర్వ్చేస్తారు. మాస్టర్ ప్లాన్ లో ఓ భూమిని గ్రీన్ బెల్ట్ లేదా గ్రీన్ పార్క్ కోసం రిజర్వు చేసినప్పుడు ప్రభుత్వానిదైనా లేక ప్రైవేటుదైనా నిర్మాణాలకు అనుమతి ఉండదు. ఎలాంటి అనుమతి ఇచ్చినా అనుమతి లేకుండా కట్టిన చట్ట వ్యతిరేకమే. గ్రీన్ బెల్ట్ కోసం కేటాయించిన ప్రాంతాలను నివాస లేదా వాణిజ్యపర ప్రాంతాలుగా మార్చే అవకాశం లేదని గతంలో కోర్టులుతీర్పులు చెప్పాయి.
నిబంధనల ప్రకారం ప్రతి లే ఔట్ లో గ్రీన్ బెల్ట్ వదిలి పెట్టాలి. పార్కులు ఉండాలి. అలాంటి చోట్లను కూడా ఆక్రమించి ఇళ్లు కట్టేస్తున్నారు. వాటిని అమ్మేస్తున్నారు. కొన్నప్పుడు బాగానే ఉన్నా.. తర్వాత రాను రాను సమస్యగా మారుతుంది. అందుకే ఇళ్లు కొనుగోలు చేసేటప్పుడు ఆ ఇల్లు గ్రీన్ బెల్ట్ లో కట్టారో లేదో చూసుకోవాల్సి ఉంటుంది.