ఈ దీపావళికి రిలీజ్ అయిన రెండు తమిళ సినిమాలు కోలీవుడ్లో హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. కమల్ ‘తూంగావనం’ గా వస్తే, అజిత్ ‘వేదలం’ గా వచ్చాడు.. అయితే రెండు మంచి టాక్ తెచ్చుకున్నా.. వీటిలో అజిత్ వేదలం మాత్రం భారీ కలక్షన్స్ రాబట్టే దిశగా పరుగులు తీస్తుంది. కమల్ తూంగావనం కూడా మంచి టాక్ రాన్ అవుతున్నా సినిమా కేవలం ఏ క్లాస్ ఆడియెన్స్ కే నచ్చే అంశాలు ఉండటంతో మరీ అంత కలక్షన్స్ వచ్చేలా లేవు. అయితే అసలే అటు ఇటు అని కొట్టిమిట్టాడుతున్న తూంగావనం మీద చెన్నైలోని భారీ వర్షాల ప్రభావం కూడా బాగా పడుతుందట.
అజిత్ సినిమా కూడా వర్షాల తాకిడి ఉన్నా ఆ సినిమా బి,సి సెంటర్స్ లో బీభత్సమైన కలక్షన్స్ సాధిస్తుంది. అయితే ఎటొచ్చి కమల్ తూంగావనం సినిమాకే వర్షాలు లాస్ తెచ్చేలా ఉన్నాయని ట్రేడ్ టాక్. రాజేష్ ఎం. సెల్వం డైరక్షన్లో కమల్, త్రిష, మధుశాలిని నటించిన తూంగావనం దీపావళి నాడు రిలీక్ అయ్యింది.
ఇదే సినిమా చీకటి రాజ్యంగా ఈ నెల 20న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కమల్ హాసన్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. సినిమా ఇక్కడ అయినా మంచి హిట్ అయ్యి భారీ కలక్షన్స్ రాబట్టాలని కోరుకుంటున్నారు.. ఇక చెన్నైలో కూడా వర్షాలు తగ్గుముఖం పడితే అటు తూంగావనం, ఇటు అజిత్ వేదలం సినిమాలు ఇంకా భారీ కలక్షన్స్ రాబట్టే చాన్స్ ఉంది. మొత్తానికి చెన్నైలో వర్షాలు ఈ రెండు సినిమాల మీద గట్టి ప్రభావాన్ని చూపాయనే చెప్పాలి.