చెన్నైనుండి మంగళూరు వెళుతున్న చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ ఈరోజు తెల్లవారు జామున సుమారు 2.30 గంటలకు తమిళనాడులో కడలూరు జిల్లా వృద్దాచలం అనే ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు కానీ 42మందికి గాయపడ్డారు. ఈ సమాచారం అందుకొన్న రైల్వే సిబ్బంది, స్థానిక అధికారులు అక్కడికి చేరుకొని గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. రైల్వేలలో భద్రతాప్రమాణాలను పెంచడం గురించి పార్లమెంటులో ఎన్ని ప్రసంగాలు చేసినా ప్రమాదాలు తగ్గడంలేదు. పైగా మరింత పెరుగుతూనే ఉన్నాయి.