కరోనా సెకండ్ వేవ్‌కి కారణం ఎవరు..? . ప్రపంచంలో ఏ దేశంలో లేనంత దారుణంగా సెకండ్ వేవ్ పరిస్థితులు ఉన్న నేపధ్యంలో ఈ డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. అందరికీ ఆన్సర్ తెలుసు. బయటకు చెప్పుకోలేరు. కానీ మద్రాస్ హైకోర్టు మాత్రం అలాంటి మొహమాటలేమీ పెట్టుకోకుండా.. తన ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్‌కు ఎన్నికల కమిషనే కారణమని మండిపడింది. అంతే కాదు.. అధికారులపై మర్డర్ కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిసి కూడా.. ఎన్నికల ప్రక్రియలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం నిశ్చితాభిప్రాయం. బహిరంగ సభలు, ర్యాలీలు ఆపకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
కరోనా నిబంధనలు పాటించకుండా అలా వైర్స వ్యాప్తి చేసేలా రాజకీయ పార్టీలు వ్యవహరి్సతున్నా.. ఎందుకు ఆపలేదని ఈసీని హైకోర్టు సూటిగా ప్రశ్నించారు. కనీసం కౌంటింగ్‌కు అయినా జాగ్రత్తలు తీసుకుంటున్నారా.. అని ప్రశ్నించింది. కౌంటింగ్‌కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో బ్లూ ప్రింట్ ఇవ్వాలని ఆదేశించింది. మే2 న కౌంటింగ్ రోజు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఎన్నికలు రద్దు చేస్తామని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. దేశంలో కరోనా పరి్సథితి ఈ స్థాయిలో పెరగడానికి ఎన్నికల కారణమన్నది ఎక్కువ మంది అభిప్రాయం.
తప్పనిసరిగా ఎన్నికలు పెట్టాల్సి వస్తే.. జాగ్రత్తలు తీసుకోవాలి కానీ.. ఎక్కడ ఎన్నిక జరిగినా ఏ రాజకీయ పార్టీ కూడా ఎలాంటి నిబంధనలు పాటించలేదు. లక్షల మందితో సభలు సమావేశాలు నిర్వహించారు. ఫలితంగా కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా తీవ్రమయింది. ఇప్పుడు కంట్రోల్ చేయలేని స్థితికి చేరింది. ప్రజల మనసుల్లో ఉన్న అభిప్రాయం మద్రాస్ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యల రూపంలో బయటకు వచ్చిందని భావిస్తున్నారు.