ఇటు బలపరీక్ష జరపాలని స్టాలిన్ పిటిషన్, అటు తమపై వేటు చట్ట విరుద్దం అని దినకరన్ పిటిషన్.ఇంతలోనే చెన్నై చేరుకున్న గవర్నర్. గవర్నర్ ని కలవడానికి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించిన పళని స్వామి. అపాయింట్ మెంట్ ఇవ్వని గవర్నర్. ఇదీ చెన్నై రాజకీయ చదరంగం లో ఇవాళ్టి పరిస్థితి. మొత్తానికి ఇవాళ కోర్ట్ ఏ తరహా తీర్పు, ఎటువంటి నిర్ణయం వెలువరుస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆర్నెల్ల క్రితం చావు తప్పి కన్నులొట్టబోయినట్లు అసెంబ్లీ బలపరీక్ష పాసయిన పళని స్వామి ప్రభుత్వం, ఆ తర్వాత పన్నీర్ సెల్వం తో కలిసిపోయి, దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు 18 మంది ని సస్పెండ్ చేసి దినకరన్ కి షాకిచ్చిన విషయం తెలిసిందే. సస్పెండైన దినకరన్ వర్గ ఎమ్మెల్యేలని రిసార్ట్ లో ఉంచి, దినకరన్ కోర్ట్ లో కేస్ వేసాడు. ఇటు స్టాలిన్ కూడా బలపరీక్ష కోసం గవర్నర్ ని కలిస్తే గవర్నర్ ఏ విషయమూ తేల్చకపోవడం తో కోర్టుకి వెళ్ళాడు.
అయితే కోర్ట్ స్టాలిన్ పిటిషన్ మేరకు బలపరీక్ష కి ఆదేశించినా , ఇప్పటికిప్పుడు పళని ప్రభుత్వానికి వచ్చిన ఇప్పంది ఏమీ లెడు కానీ దినకరన్ కి అనుకూలంగా నిర్ణయం వస్తే మాత్రం పళని కి చిక్కులు తప్పవు. కానీ అలా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఈ తీర్పు సందర్భంగా కోర్ట్ ఈ తమిళ రాజకీయ చదరంగం పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందనేది కీలకంగా మారింది.