చెప్పను బ్రదర్ అన్న ముక్క పట్టుకొని బన్నీని ఓ ఆటాడించేశారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. సోషల్ మీడియాలో బన్నీ వెర్సెస్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోలాటం కొన్ని రోజులు నడిచింది. చివరికి అలా ఎందుకు అనాల్సివచ్చిందో… ఓ పెద్ద సైజు స్పీచులో చెప్పుకొచ్చాడు బన్నీ. ఆ ఎపిసోడ్ అక్కడితో శుఖాంతం అయిపోయిందనుకొంటే.. ఇప్పుడు సెల్ఫీ రాజా సినిమా మళ్లీ దాన్ని కెలుకుతూ కూర్చుంది. సెల్ఫీ రాజా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. నరేష్ సినిమా అంటే.. స్నూఫ్‌లు, పేరడీ డైలాగులూ ఉంటాయన్నది తెలిసిన విషయమే. ఈసారి ‘చెప్పను బ్రదర్’ అనే డైలాగ్‌నీ వాడేశాడు.
ఫృథ్వీ చేత ఈ డైలాగ్ పలికింది… ఓ రేంజులో సెల్ఫీ రాజా టీజర్‌కి లాస్ట్ పంచ్ విసిరాడు. ట్రైలర్ ఎలాగున్నా.. అందరి దృష్టీ ‘చెప్పను బ్రదర్’ అనే డైలాగ్పై పడిపోయింది. మళ్లీ కొన్ని రోజుల పాటు.. ఎట్లీస్ట్ ‘సెల్ఫీరాజా’ విడుదలైనంత వరకైనా ఈ డైలాగ్ మారిమోగిపోవడం ఖాయం. ఈ శుక్రవారమే నరేష్ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి సినిమాలో బన్నీని ఏ రేంజులో ఆడుకొన్నాడో …??