రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పట్నం కుటుంబం పూర్తిగా సైలెంట్ అయిపోయింది. కనీసం రాజకీయ తెరపై కూడా కనిపించడం లేదు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీతా మహేందర్ రెడ్డి యాక్టివ్ గా తిరగడం లేదు. దీంతో పట్నం ఫ్యామిలీకి ఏమైంది అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకటే చర్చ జరుగుతోంది.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున చేవెళ్ల టికెట్ ఆశించినా పట్నం ఫ్యామిలీకి రాజకీయ సమీకరణాలలో భాగంగా.. రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన మాల్కాజ్ గిరి స్థానం నుంచి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతను పోటీ చేయించారు.బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉండటంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఓటమి తప్పించుకోలేకపోయింది. అప్పటి నుంచి పట్నం ఫ్యామిలీ రాజకీయ తెరపై అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తోంది.
అయినప్పటికీ పట్నం ఫ్యామిలీకి రంగారెడ్డి జిల్లాలో గట్టి పట్టు ఉండటంతో వారికి రేవంత్ ఏదో ఒక పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ దిశగా రేవంత్ నిర్ణయాలు లేకపోవడంతో పట్నం ఫ్యామిలీ పూర్తిగా సైలెంట్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు చేవెళ్ల స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రంజిత్ రెడ్డి కూడా సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. ఒకే జిల్లాకు చెందిన పట్నం ఫ్యామిలీతోపాటు రంజిత్ రెడ్డి కూడా మౌనం వహించడం హాట్ టాపిక్ అవుతోంది.